ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలోని ప్రముఖ ఘట్టమైన పాదయాత్రను యాత్ర పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల ఆపాలంటు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 6కి వాయిదా వేసింది. సినిమాలో కొందరు నాయకులు గురించి అవమానకరంగా చూపించారని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. అయితే సినిమాలో కేవలం వైఎస్ఆర్ పాదయాత్ర గురించి మాత్రమే చూపించానని చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయినప్పటికి సినిమాపై ఇలా కోర్టుకు వెళ్లడం చూస్తే యాత్రపై ఏదో కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. సినిమా వాయిదా పడుతుందేమో అని అందోళన చెందుతున్నారు వైఎస్ఆర్ అభిమానులు. యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో జగపతి బాబు, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చూసుకుంది.సెన్సార్ బోర్డ్ కూడా ఎలాంటి కట్స్ చెప్పకుండా సినిమాను సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా తెలుగు,మళయాళ భాషలలో వచ్చె నేల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
