Thursday, May 16, 2024
- Advertisement -

‘ప్రేమికుడు’ ఆడియో వేడుక‌

- Advertisement -

మాన‌స్‌, స‌న‌మ్ శెట్టి  జంట‌గా న‌టించిన సినిమా ‘ప్రేమికుడు’. డిజి పోస్ట్ సమర్పించింది.  ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై  రూపొందుతోంది. క‌ళాసందీప్ దర్శకుడు. లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మాత‌లు.  విజయ్ బాలాజీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ చౌదరి, రాహుల్, షాలు, బెక్కంవేణుగోపాల్, కిషోర్ రాఠీ, ప్రసన్నకుమార్, పృథ్వీ, సాగర్, తమ్మలపల్లి రామసత్యనారాయణ, పద్మిని, సాయివెంకట్, కవిత, అనితాచౌదరి తదితరులు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

 థియేట్రికల్ ట్రైలర్ ను వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ చౌద‌రి  సంయుక్తంగా విడుదల చేశారు. బిగ్ సీడీని సాగర్, వి.వి.వినాయక్, ఎ.యస్.రవికుమార్ చౌదరి విడుదల చేశారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి తొలి సీడీని సాగర్, ఎ.యస్.రవికుమార్ చౌదరికి అందించారు.

డిజిపోస్ట‌ర్ సంస్థ‌తో త‌మ‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంద‌ని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని వి.వి.వినాయ‌క్ అన్నారు. తాము ఉప్ప‌ల‌పాటి స‌త్య‌నారాయ‌ణ‌గారిని అప్పా అని పిలిచేవాళ్ళ‌మ‌ని, ఆయ‌న త‌న‌యుడు ఏర్పాటుచేసిన డిజిపోస్ట్ పెద్ద స‌క్సెస్‌ను తెచ్చుకోవాల‌ని ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు. మంచి మ్యూజిక్ వ‌చ్చింద‌ని, అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాన‌ని విజ‌య్ బాలాజీ చెప్పారు.

.టీమ్ వ‌ర్క్ తో చేసిన సినిమా అని, ప్ర‌తి సీన్‌నీ ద‌ర్శ‌కుడు ప‌క్కా ప్లానింగ్‌తో తీశార‌ని, ఎక్కువ భాగాన్ని నెల్లూరులో తెర‌కెక్కించామ‌ని మాన‌స్ అన్నారు.  కళాసందీప్ మాట్లాడుతూ ‘’కథ వినగానే నిర్మాతలు  సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్ గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. డిజి పోస్ట్ నా మాతృసంస్థ. కళ్యాణ్ గారు, రఘుగారు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు“ అని అన్నారు.  హీరో త‌ల్లి పద్మిని మాట్లాడుతూ “సినిమా ప‌ట్ల ప్యాష‌న్ ఉన్న వాళ్ళందరూ క‌లిసి చేసిన చిత్ర‌మిది. గ్రాండ్‌గా ఉంటుంది. విజ‌య్ బాలాజీ మంచి సంగీతాన్నిచ్చారు“ అని అన్నారు. 

మానస్, సనం శెట్టి, అజీజ్, షకలకశంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అనితాచౌదరి, శశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధు, కెమెరా: కె.శివ, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాసందీప్ బి.ఎ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -