Sunday, May 19, 2024
- Advertisement -

నిర్మాత జయకృష్ణ కన్నుమూత

- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జయకృష్ణ కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.   సీనియర్  నటులు కృష్ణంరాజు, జయసుధ లకు మేకప్ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. పలు విజయవంతమైన సినిమాలకు నిర్మాణ సారధ్యం వహించారు.

మన ఊరి పాండవులు (1978), మంత్రిగారి వియ్యంకుడు (1983), నీకు నాకు పెళ్లంట (1988) తదితర  చిత్రాలను  ఆయన  నిర్మించారు.   బాపు దర్శకత్వంలో చిరంజీవి హీరో గా  జయకృష్ణ   నిర్మించిన ‘మన ఊరి పాండవులు’  ఫిలిం ఫేర్ అవార్డు గెల్చుకుంది. ఇంకా  సీతారాములు, కృష్ణార్జునులు, వివాహభోజనంబు తో పాటు  15 స్ట్రెయిట్ చిత్రాలు, 22 డబ్బింగ్ సినిమాలను  ఆయన నిర్మించారు.  గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా దాసు.  జయకృష్ణ సుదీర్ఘ విరామం తరువాత  సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై  సినిమా నిర్మించాలని  ప్రయత్నించారు.   జయకృష్ణ మూవీస్ పతాకంపై ‘ఒక తార’ అనే సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మృతి  తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.  కాగా  జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో  ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -