Wednesday, May 15, 2024
- Advertisement -

‘మెహబూబా’ సినిమా రివ్యూ

- Advertisement -

ఒక్క హిట్ తండ్రీ కొడుకులు జీవితం మీద ఆదార‌ప‌డింది.వారే పూరి జ‌గ‌న్నాథ్,ఆయ‌న త‌న‌యుడు ఆకాష్ పూరి.పూరి త‌న కొడుకుని హీరోగా లాంచ్ చేస్తు తీసిన సినిమా ‘మెహబూబా’. సినిమా ఈ రోజు(శుక్రవారం)విడుద‌ల‌వుతుంది.ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంతో ఉన్నాడు పూరి.పైగా చాలాకాలం త‌రువాత పూరి త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో సినిమాను తీశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి నేహాశెట్టి చేసింది.‘మెహబూబా’ట్రైల‌ర్‌,టీజ‌ర్ చూశాక సినిమాపై అంచానాలు పెరిగాయి.పూరి త‌న రోటిన్‌కు దూరంగా సినిమాను తెర‌కెక్కించాడు.నిన్న స్టూడెంట్స్‌కు స్పెష‌ల్ షో ద్వారా సినిమాపై రెస్ప‌న్స్ ఎలా ఉందో చెక్ చేసుకున్నారు.సినిమా బాగుంద‌ని టాక్ రావ‌డంతో సినిమా హిట్‌పై న‌మ్మ‌కంతో ఉన్నారు.చిత్ర యూనిట్‌.మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

క‌థ : చిన్నప్పటి నుండి ఆర్మీ లో జాయిన్ కావలి అనుకునే కుర్రాడు, అనుకోకుండా పాకిస్తాన్ నుండి చదువు కోసం ఇండియా కి వచ్చే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు, తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అనేది సింపుల్ గా సినిమా కథ.అ పాయింట్ తో మొదటి అర్ధభాగం వరకు పార్టు పార్టులుగా కొన్ని మంచి సీన్స్ ని రాసుకున్నా కొన్ని బోర్ కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి. ఆకాష్ పూరీ మాత్రం మంచి ఈజ్ తో నటించి నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త హీరోయిన్ నేహా శెట్టి బాగానే నటించింది. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా పూరీ ఈ సారి కొట్టేలానే ఉన్నాడే అన్న నమ్మకం కలుగుతుంది, సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం ఆసక్తిగా మొదలు అయినా అక్కడక్కడ తప్పితే పూరీ మ్యాజిక్ సెకెండ్ ఆఫ్ లో చాలా చోట్లా పర్వాలేదు అనిపించుకుంది.ఓవరాల్ గా సినిమా రీసెంట్ గా పూరీజగన్నాథ్ తీసిన సినిమాలలో టెంపర్ తర్వాత బెస్ట్ అనిపించుకుంది కానీ పూరీ జగన్నాథ్ కి మాత్రం అల్టిమేట్ కంబ్యాక్ అని చెప్పలేం. కానీ హీరోగా ఆకాష్ మాత్రం మంచి ఈజ్ తో నటించి మెప్పించాడు.

విశ్లేష‌ణ:డిఫెరెంట్ లవ్ స్టొరీ తో పూరీజగన్నాథ్ తన కొడుకుని తన దర్శకత్వంలో బాగానే ప్రజెంట్ చేశాడు, డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే కొన్ని సార్లు బాగుంటుంది, కొన్ని సార్లు స్లో అవుతుంది, సెకెండ్ ఆఫ్ లో స్లో సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సంగీతం పర్వాలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అనిపిస్తుంది, మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరు ఆకట్టుకున్నారు. డైరెక్టర్ గా పూరీజగన్నాథ్ సగం సక్సెస్ అయినట్లే అయి జస్ట్ లో మిస్ అయ్యాడు అనిపిస్తుంది.ఓవరాల్ గా సినిమా ముందు చెప్పుకున్నట్లు పూరీ తీసిన రీసెంట్ మూవీస్ లో బెస్ట్ అని చెప్పొచ్చు.

బ‌లం: స్టోరీ,ఆకాష్ యాక్ష‌న్‌,సినిమాటోగ్ర‌ఫీ
బ‌ల‌హీన‌త‌లు: స్టోరీ నెరేష‌న్‌.బోరింగ్ సీన్‌

బోట‌మ్ లైన్: పూరి గ‌ట్టిగ‌ కొట్టిన దెబ్బ మాత్రం త‌గ‌ల‌లేద‌నిపిస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -