సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ హీరోలు ఎంత పని అయిన చేసేస్తారు. అనురాగ్ బసు డైరెక్షన్ లో.. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా ‘జగ్గా జాసూస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి.. ప్రెస్ మీట్లో.. జరిగిన ఓ సంఘటన చూసి.. అందరూ షాక్ అయ్యారు.
{loadmodule mod_custom,GA1}
సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో హీరో రణబీర్ కపూర్.. ఉన్నట్లు ఉండి.. దర్శకుడిపై ముద్దుల వర్షం కురిపించాడు. తన పెదాలతో అతడి పెదాలను ముద్దాడాడు. హీరో, హీరోయిన్ ముద్దు పెట్టుకుంటే.. పెద్ద వార్త్ అయ్యేదో.. కాదో కానీ.. ఇలా హీరో, దర్శకుడు మీడియా ముందే ముద్దులాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఐదేళ్ల క్రితం కూడా రణబీర్ కపూర్ ఇలాంటి పనే చేశాడు. అప్పట్లో బర్ఫీ చిత్ర ప్రమోషన్లో ఇదే విధంగా అనురాగ్ బసును ముద్దాడిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా.. పబ్లిసిటీ స్టంటే అంటున్నారు బాలీవుడ్ వాళ్లు. ఏదో ఒక సంచనలం క్రియేట్ చేస్తే.. సినిమా బాగా ప్రమోట్ అవుతుందని.. ఇలాంటివి చేస్తుంటారు.
{loadmodule mod_custom,GA2}
ఇక సినిమా విషయంలోకి వెళ్తే.. ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా ఉంటుందట. కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన ‘జగ్గా జాసూస్’ జులై 14న విడుదల కాబోతోంది.
{youtube}1ilnEVZNsyQ{/youtube}
{youtube}wt0Oh0YCOMo{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related