Sunday, May 19, 2024
- Advertisement -

‘శమంతకమణి’ మూవీ రివ్యూ

- Advertisement -

‘శమంతకమణి’ ఈ సినిమా టైటిల్ తో నే అంచనాలను సృష్టించింది. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఇలా నాలుగు హీరోలు కలిసి ఒక ముల్టీస్టార్ర్ర్ సినిమా చేయడం తెలుగు లో ఇదే మొదటి సారి. రెగ్యులర్ సబ్జెక్టు ను పక్కన పెట్టి ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాను నలుగురు హీరోలు కలిసి తీసి మంచి క్రేజ్ తెచ్చారు. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ ‘శమంతకమణి’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
ఈ మూవీ 5 కోట్ల కార్ దొంగతనం అనే బ్రేకింగ్ న్యూస్ తో మొదలు అవుతోంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ రంజిత్ (నారా రోహిత్) ను అపాయింట్ చేస్తారు. ఇక అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దొంగతనం చేసిన నలుగురిని ఇంట్రడ్యూస్ అవుతారు. దొంగతనం చేసిన ఆ నలుగురు ఆది, సందీప్ కిషన్, సుధీర్, రాజేంద్ర ప్రసాద్. ఒకరు డబ్బు కోసం కార్ దొంగిలిస్తే, మరొకరు మాత్రం కార్ల మీద ఉండే ఇష్టంతో, నలుగురిలో స్టేటస్ కోసం కార్ దొంగిలిస్తాడు. ఒకరు ప్రేమించిన అమ్మాయి కోసం, మరొకరు డబ్బుతో వేరే పని ఒకటి చేయాలనీ కార్ దొంగిలిస్తారు. అసలు ఆ కారు ఎవరిది..? ఆ నలుగురు ఆ కారును ఎలా దొంగలించారు..? పోలీసులకు దొరికారా? అనే ప్రశ్నలకు జవాబు తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

ఎలా చేశారు :
సరైన కాస్టింగ్ ఎంచుకొని అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. అతి చిన్న స్టోరీ లైన్ తో సినిమా మొత్తం నడిపించారు. అయితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే కథ లో ఊహించని మలుపులు దర్శకుడి పనితనాన్ని బయటపెట్టాయి. ఇక నలుగురు హీరోలతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. ఏ సీన్ కి ఆ సీన్ బాగున్నా ఓ మాలగా కట్టాక చూస్తే మాత్రం ఎక్కడో ఏదో లోపం అనిపించింది. ఆ తెలియని వెలితి బహుశా కధనాన్ని నడిపిన తీరు కావొచ్చు. ఇక సినిమా లోని క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా మరియు అద్భుతంగా డీల్ చేశారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. రొటీన్ కు భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్టు ను ఎంచుకుని నలుగురు హీరోలు కలిసి ప్రయోగాత్మకంగా చేసిన ఇటువంటి సినిమాలు ఎక్కువగా వస్తే బాగుంటుంది.

ప్లస్ పాయింట్స్ :
నారా రోహిత్, సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్
రాజేంద్ర ప్రసాద్ కామెడీ
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
పాటలు లేకుండా సినిమా సాగిపోవడం
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
కొంచెం స్లో అయిన స్క్రీన్ ప్లే

మొత్తంగా : సస్పెన్సు.., మల్టీస్టారర్, చేజింగ్ వంటి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -