Wednesday, May 15, 2024
- Advertisement -

ఆమెపై కేసులు కొట్టేయాలి.. ప్రియ‌కు ఊర‌ట‌

- Advertisement -

కుర్ర‌కారును క‌నుసైగ‌ల‌తో గిలిగిలిపెట్టిన మలయాళ నటి ప్రియాప్రకాశ్‌ వారియర్‌కు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెపై, ఆ సినిమాపై ఎవ‌రూ కేసులు న‌మోదు చేయ‌వ‌ద్ద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు చేసిన కేసుల‌ను కొట్టి వేయాల‌ని బుధ‌వారం తీర్పు ఇచ్చింది. ప్రియా వారియ‌ర్ న‌టించిన ‘ఒరు అదార్‌‌ లవ్‌’ సినిమాలో ఓ పాటపై తెలంగాణలో, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల్లో తనపైన, దర్శకుడిపై కేసులు న‌మోద‌య్యాయి. త‌మ‌పై క్రిమినల్‌ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినిమా బృందంపై పలువురు వేసిన క్రిమినల్‌ కేసులపై స్టే విధిస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హీరోయిన్‌, దర్శకుడిపై దేశవ్యాప్తంగా ఎక్కడా క్రిమినల్‌ కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది.  ప్రియ వారియర్‌, అబ్దుల్ రవూఫ్‌ జంటగా నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాను ఒమ‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఇటీవ‌ల ఈ సినిమా సెన్సేష‌న్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఓ పాట ఉందని హైదరాబాద్‌లోని కొందరు విద్యార్థులు మొదటగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రియతో పాటు చిత్ర దర్శకుడిపై తెలంగాణ, మహారాష్ట్రల్లో ప‌లువురు కేసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయ‌డంతో సినిమా బృందం స్పందించింది. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -