Saturday, May 18, 2024
- Advertisement -

ఈ విషయంలో బాహుబలి కన్నా.. శ్రీమంతుడిదే పై చేయి..!

- Advertisement -

తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సినిమాది ప్రత్యేక స్థానం అని అనేక మంది అభిప్రాయపడుతూ వచ్చారు. ఆ సినిమా సృష్టించిన రికార్డులతో అభిప్రాయం కలుగుతుంది. అయితే కొన్ని వారాల వ్యవధిలోనే బాహుబలిని బీట్ చేసే తెలుగు సినిమా వచ్చేయడం విశేషం.

ఇది వివిధ రికార్డుల విషయంలో బాహుబలిపై పై చేయి సాధిస్తోంది. బాహుబలికి పెట్టినంత బడ్జెట్ పెట్టకపోయినా.. ఈ సినిమా కొత్త రికార్డులను అయితే అవలీలగా అధిగమిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. శాటిలైట్ రైట్స్ విషయంలో ‘శ్రీమంతుడు’ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా టెలికాస్ట్ రైట్స్ ను పది కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకొందట జీ తెలుగు. మరి ఇది ఒక తెలుగు సినిమాకు సంబంధించి ఇది రికార్డు స్థాయి మొత్తమే అని చెప్పాలి. ఇప్పటి వరకూ ఏ సినిమా రైట్స్ పలకని స్థాయి మొత్తాన్ని రీచ్ అయ్యాయి శ్రీమంతుడు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్. మరి బాహుబలిని ఈ విషయంలో శ్రీమంతులు అధిగమించినట్టే.

ఇప్పటి వరకూ బాహుబలి పార్ట్ వన్ రైట్స్ ను ఎవరూ కొనలేదు. ఆ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగూ బాహుబలి పార్ట్ వన్ అసంపూర్ణం. ఎవరైనా టీవీ వాళ్లు ఒక పార్ట్ రైట్స్ ను కొంటే చాలదు. రెండో పార్ట్ రైట్స్ కూడా వాళ్లే కొనాలి. దీంతో ఉమ్మడిగా ఈ రెండు సినిమా రైట్స్ ను కొనడానికి ఎంత వెచ్చిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు పార్ట్ ల మొత్తం లో ఒక్కో పార్ట్ విలువ పది కోట్ల రూపాయలు పలికే అవకాశాలు అయితే లేవు. మరి ఈ విధంగా చూసుకొంటే.. బాహుబలి కన్నా శ్రీమంతుడు పై చేయి సాధించినట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -