- Advertisement -

‘ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు’

- Advertisement -

టాలీవుడ్ విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం.47’ (Aadarsha Kutumbam). భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలను మేకర్స్ వేగవంతం చేశారు.

తాజాగా ఈ చిత్రంలో కథానాయిక శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా ‘స్వర్ణ’ అనే విభిన్నమైన పాత్రలో శ్రీనిధి శెట్టి సందడి చేయనున్నారు. తెరపై వెంకటేశ్, శ్రీనిధి శెట్టి భార్యభర్తలుగా కనిపించనున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట హైలైట్‌గా నిలిచింది. ‘‘ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు’’ అంటూ భార్య స్వర్ణ గురించి వెంకీ మామ చెప్పే సరదా సంభాషణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్విస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈ చిన్న వీడియో స్పష్టం చేస్తోంది.

‘కేజీఎఫ్’, ‘కోబ్రా’ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, తొలిసారిగా వెంకటేశ్‌తో కలిసి నటిస్తుండటంతో ఆమె పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకులను అలరించనున్నారు. నారా రోహిత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -