ఇండియాలో ఎన్ని స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్స్ ఉన్న రెడ్-మికి ఉన్న క్రేజ్ వేరు.అతి తక్కువ ధరకు ఎక్కువ ఫిచర్స్ ఉన్న ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చి అందరి మన్ననలు పొందింది.తాజాగా ఈ సంస్థ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. లేటెస్ట్ మోడల్ `రెడ్ మి నోట్6 పీఆర్ వో` టూమచ్ హాట్. 6జీబీ మెమరీ – 48 గంటల పాటు డోఖాలేని బ్యాటరీ బ్యాకప్ (4000ఎంఏహెచ్) .. ఐఫోన్ ని మించిన పీచర్లతో కేవలం 15కె రేంజులో లభిస్తుంటే యూత్ ఊరుకుంటుందా? స్పాట్ సేల్ ధమాకా మోగించేస్తోంది. రెండ్ మి కంపెనీ అంతే తెలివిగా తన బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోంది ఇండియాలో. ముంబై టు సౌత్ అందాల కథానాయికలందరినీ ఒడిసిపట్టి వీళ్లతో ఓ రేంజులో ప్రమోషన్ చేస్తోంది.
ఇందులో సౌత్-నార్త్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ – సమంత – పూజా హెగ్డే – అదాశర్మ – అనిత సోనాక్షి సిన్హా – మౌనిరాయ్ – క్రిస్టిల్ డిసౌజా – దిశా పటానీ – ఈవ్ లిన్ శర్మ – కృతి కర్భంద ఇలా అందాల భామలంతా సామాజిక మాధ్యమాల వేదికగా బోలెడంత ప్రచారం చేస్తున్నారు. వీళ్లతో వీడియో టీజర్ లు రూపొందించి రెడ్ మి కంపెనీ బోలెడంత హంగామా చేస్తోంది. యూత్ లో దూసుకుపోతున్న భామలందరినీ రెడ్ కోడ్ లోకి దించేసిన సదరు చైనా కంపెనీ అంతర్జాలంలో హాట్ సేల్ కి రెడీ అవుతోంది. నేటి మధ్యాహ్నం 12గంటలకు ధమాకా సేల్ ఆఫర్లను ప్రకటించింది.
