Wednesday, May 15, 2024
- Advertisement -

‘తుంటరి’ మూవీ రివ్యూ

- Advertisement -

ఎంచుకునే కథాంశాలు ఎంత కొత్తగా ఉన్నా వాటికి సరైన కమర్షియల్ హంగులు అద్దక పోవడమో ఏమో కానీ నారా రోహిత్ కి సరైన హిట్ ఒచ్చి చాలా కాలం అయ్యింది. గుండెల్లో గోదారి, జోరు లాంటి ప్లాపు ల తరవాత కూడా కుమార్ నాగేంద్ర కి ఛాన్స్ ఇచ్చన నారా రోహిత్ ఒక రీమేక్ సినిమాని తీసుకుని సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఎంతగా సఫలీకృతం అయ్యింది అనేది చూడాలి.

కథ – కథనం – పాజిటివ్ లు : 

ఎప్పటి లాగానే మంచి కథాంశాన్ని ఎంచుకున్నుడు హీరో నారా రోహిత్. నలుగురు స్నేహితులు కిషోర్(రోహిత్), పూజ, సుదర్శన్, ఆనంద్ , కల్కి లు అతి పెద్ద అడవిలో ఏవో రీసర్చ్ లు చేస్తూ ఉండగా వారికి ఒక బాక్సింగ్ టోర్నమెంట్ గురించి తెలుస్తుంది. ఆ నలుగురూ ఈ టోర్నమెంట్, దాని ప్రైజ్ మనీ విషయం లో ఆలోచనలో పడతారు.

ప్రైజ్ మనీ విషయం లో బేరం కుదిరిన తరవాత తను బాక్సర్ కాదు అన్న విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్ కి. ఇలోగా సిరి(లతా) అనే అమ్మాయి అతని జీవితం లోకి రావడం తో అతని లైఫ్ టర్న్ అవుతుంది. ఆమె కోసమైనా తను ఆ బాక్సింగ్ గెలవాల్సిన పరిస్థితి రావడం తో బలమైన ప్రత్యర్ధి కబీర్ (రాజు) మీద గెలుస్తాడు హీరో. ఏరకంగా వారు ఇది సాధించారు అనేది సినిమాలో ట్విస్ట్. ఒక సాధారణ కుర్రాడు భారీ అప్పోజిషన్ మీద గెలుపు పొందడం ఇక్కడ మూల కథ .

నారా రోహిత్ సాధారణ కుర్రాడు గా బాగా చేసాడు. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్ లలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కొత్త అమ్మాయి పర్లేదు అనిపించింది. కబీర్ రూపం లో తెలుగు సినిమాకి ఒక కొత్త విలన్ దొరికినట్టే. ఈ సినిమా డైరెక్టర్ కుమార్ నాగేంద్ర కి కాస్త ఊరటన నిస్తుంది అని చెప్పచ్చు. రీమేక్ ని ఎంచుకుని సేఫ్ గేం ఆడాలి అనుకున్న వారు ఐడియా మంచిది గా తోస్తోంది. లవ్ స్టోరీ, కామిడీ , బాక్సింగ్ తార్నమేంట్ ఇవి బాగా పండాయి. కథనం చక్కగా సాగింది. వెన్నెల కిషోర్ , రోలర్ రఘు కామేదే బాగుంది.  మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది సెకండ్ హాఫ్ కి ఒచ్చే సరికి సినిమా బాగా డల్ అనిపిస్తుంది . ఫస్ట్ హాఫ్ లో ఒచ్చిన జోష్ ఇందులో మిస్ అయింది అని అనిపిస్తుంది. పాటలు కూడా ఎక్కడ పడితే అక్కడ దూర్చి ఎడిటింగ్ భాగం విసిగించారు. ఫస్ట్ హాఫ్ లో సాగిన టెంపో ని సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ కాపాడలేక పోయాడు. కామెడీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని చెప్పచ్చు. సరైన చోట కామెడీ పెట్టకుండా డిఫరెంట్ ట్రాక్ రాసుకొచ్చారు . ఒర్జినల్ వెర్షన్ తో పోల్చడం చాలా ఇబ్బందికరమైన అంశం. స్క్రీన్ ప్లే ఇంకా జాగ్రత్త పడుంటే బాగుండేది అనిపించింది. 

మొత్తంగా , తుంటరి సినిమా నారా రోహిత్ కీ డైరెక్టర్ నాగేంద్ర కీ కచ్చితంగా ఊరట కలిగించే చిత్రం అని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే పెద్దగా ఏమీ అనిపించదు కానీ . తెలుగు వెర్షన్ లో కమర్షియల్ హంగులు బాగానే యాడ్ చెయ్యడం వలన అనుకుంట టైం పాస్ సినిమా అనిపిస్తుంది.దగ్గర లో పెద్ద సినిమాలు కూడా ఏవీ లేవు కాబట్టి సరైన పబ్లిసిటీ ఇస్తే ఈ సినిమా అదిరిపోయే రిజల్ట్ ఇస్తుంది అని కచ్చితంగా చెప్పచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -