Sunday, May 19, 2024
- Advertisement -

‘వీరభోగ వసంత రాయులు’ రివ్యూ

- Advertisement -

తెలుగు సినిమాలు త‌మ పంథాను మార్చుకుంటున్నాయి.తెలుగు ద‌ర్శ‌కులలో ఆలోచ‌న‌ల‌లో చాల‌నే మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ కోవ‌లోకే వీరభోగ వసంత రాయులు సినిమా కూడా వ‌స్తుంది.సుధీర్‌ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌లైంది.మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ స‌మీక్ష ద్వారా తెలుసుకుందా.

క‌థ‌:క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్ లు రివీల్ చేసేలా ఈ కథను పూర్తి విసిదంగా రాయటం కుదరదు (చూద్దామనుకునేవాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి) . ఉన్నంతలో కథ అర్దమయ్యేలా చెప్తాను.పారలల్ గా సాగే మూడు సబ్ ప్లాట్స్ తో కథ మొదలవుతుంది. మెయిన్ ప్లాట్.. ఇండియన్ క్రికెటర్స్‌ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. నెక్ట్స్ ప్లాట్ చూస్తే.. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు సంచలనంగా మారతాయి. ఇక మూడో ప్లాట్ లో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు.

ఈ మూడు కేసులను తేల్చటానికి ముగ్గురు స్పెషల్ ఇన్విస్టిగేంటింగ్ ఆఫీసర్స్ ని నియమిస్తారు. వాళ్లు దీపక్ రెడ్డి (నారా రోహిత్), నీలిమ(శ్రియ), వినయ్ (సుధీర్ బాబు). ఈలోగా హైజాకర్.. తను వీరభోగవసంతరాయులు(శ్రీ విష్ణు)ని అని … తన దగ్గర ఉన్న 300 మంది బంధీలను విడుదల చెయ్యాలంటే అంతే సంఖ్యలో నేరస్తులను ప్రభుత్వం చంపేయాలని డిమాండ్‌ చేస్తాడు. మరి గవర్నమెంట్ ఆ డిమాండ్ ఓకే చేసిందా..ఈ సబ్ ప్లాట్ లకు హైజాక్ మెయిన్ ప్లాట్ కు లింకేంటి. ఈ ఇన్విస్టిగేంటింగ్ అధికారులు ఎలా ఈ కేసుని చేదిస్తారు. వీరభోగవసంతరాయులు ఎవరు..? అతని గతం ఏమిటి..? ఈ కేసులకు అతనికి లింకేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌: ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండకూడదో అలా ఉంది ఈ సినిమా నేరేషన్. అబ్ స్టాక్ట్ గా ప్రారంభమై మొదటి పదినిముషాలు ఆసక్తి లేపిన ఈ చిత్రం ఆ తర్వాత చూసే శక్తి కూడా లేనంత నీరసపరిచింది. పూర్తిగా చుట్టేసినట్లున్న ఈ సినిమాలో సన్నివేశాలు షార్ట్ ఫిలిం స్టాండర్డ్స్ ని కూడా మ్యాచ్ కావు. సీన్ సీన్ కీ సీన్ లోకి ..హీరోలు ఒకరి తర్వాత మరొకరు వస్తూంటారు.. కథ అర అంగుళం కూడా ముందుకు కదలదు. అలాగే ప్రతీ సన్నివేశం ..ఊహకు అందేటట్లే డిజైన్ చెయ్యబడి ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కు తగినట్లుగా ఎక్కడా కథలో టెన్షన్ కానీ టెంపోకానీ వేరియేషన్ కూడా కనపడదు. వీర భోగ వసంతరాయులు టైటిల్ చూసి టెమ్ట్ అయ్యి ఓ కథ రాసుకున్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడా కథకు, టైటిల్ సింక్ ఉన్నట్లు కనపడదు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం వీరభోగ వసంత రాయులు ఈ యుగంలో అవతరిస్తాడని విశ్వాసం. ఆయన వచ్చేలోగా వెండి తెరపై ఈ వీరభోగ వసంత రాయులు తన భోగం ఒలకపోస్తూ దిగారు. అయితే వీరత్వం,విషయం లేని ఆయన భోగం అట్టే కాలం నడవదని అర్దమైపోయింది. ఇంత నాసిరకంగా కూడా ఈ రోజుల్లో సినిమాలు స్టార్స్ అప్పుడప్పుడూ తీస్తూంటారని చెప్పటానికే ఈ అవతారం వెండితెరపై అవతరించిందని మనకు అవగాహనకి రావటానికి ఈ సినిమా వచ్చిందేమో అనిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -