Monday, May 20, 2024
- Advertisement -

అరెస్ట్‌పై స్పందించిన విశాల్‌

- Advertisement -

త‌మిళ హీరో విశాల్‌కు కొంతమంది నిర్మాతలకు మధ్య చోటు చేసుకున్న విభేదాలు తార స్థాయికి చేరాయి. తమిళ నిర్మాతల మండలిలోని కొంద‌రు స‌భ్యులు విశాల్‌కు వ్య‌తిరేకంగా అందోళ‌న చేప‌ట్టారు.ఈ నెల 21(శుక్ర‌వారం) 9 చిన్న సినిమాల విడుద‌ల‌కు విశాల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ స‌మ‌స్య మొద‌లైంది.ఇలా ఒకేసారి 9 సినిమాలు విడుద‌లైతే చిన్న నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్రశ్నిస్తున్నారు.చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి గురించి ఆలోచించకుండా విశాల్ ప్రవర్తిస్తున్నారని, ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయలేదని విశాల్ పై విమర్శలు చేశారు.

కొందరు నిర్మాతలు విశాల్ కి ఎదురుతిరిగి అతడిని నిర్మాతల మండలి అద్యక్ష పదవి నుండి రాజీనామా చేయమంటున్నారు.నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ రోజు ఉద‌యం మండలి కార్యాలయానికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశాడు విశాల్. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేశారు.దీనిపై స్పందించిన విశాల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

”నిర్మాతల మండలితో సంబంధం లేని వ్యక్తులు నిన్న కార్యాలయం తలుపులు, గేట్లు మూసేస్తుంటే సైలెంట్ గా ఉన్న పోలీసులు, ఈ రోజు నన్ను, నా సహోద్యోగులను, మా తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు. ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. నమ్మలేకపోతున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం మా ప్రయత్నాన్ని వదిలిపెట్టం. కచ్చితంగా పోరాడతాం అని విశాల్ ట్విట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -