Wednesday, May 15, 2024
- Advertisement -

ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ

- Advertisement -

హీరో రామ్ మళ్లీ హిట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాడు. అందుకే హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేశాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నేను శైలేజ అనే సినిమా చేశాడు. మళ్లీ అదే కాంబోలో ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేసాడు. ఈ రోజు ఈ ఉన్నది ఒకటే జిందగీ మూవీ రిలీజ్ అయింది. రామ్ సరసన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగతి అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అభి (రామ్ పోతినేని) స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. వాసు (శ్రీ విష్ణు) అంటే అభికి చాలా ఇష్టం. అతని ఎవరు ఏం అన్న అభి అసలు ఊరుకోడు. సంతోషంగా సాగుతున్న వారి లైఫ్ లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. అయితే అభికి సంగీతం అంటే చాలా ఇష్టం. మహాకి కూడా మ్యూజిక్ అంటే ఇష్టం ఉండటంతో ఇద్దరు దగ్గరవ్వుతారు. అలా వారు ఒకరినొకరు బాగా ఇష్టపడుతారు. కానీ అదే టైంలో వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. వాసు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాకే వ్యాల్యూ ఇస్తుండటంతో కోపంతో అభి, వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. అభి అసలు ఎందుకు అంత దూరంగా వెళ్లాల్సి వస్తోంది..? అభి, వాసు తిరిగి కలుసుకున్నారా..? మేఘన (లావణ్య త్రిపాఠి)కి ఈ కథతో లింక్ ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కూడా రామ్ తన మార్క్ నటనతో, ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ప్రధానంగా రాక్ స్టార్ లుక్ లో బాడీ లాంగ్వేజ్, పర్పామెన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. ఇక వాసు పాత్రలో శ్రీ విష్ణు బాగా చేశాడు. అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు. అనుపమా పరమేశ్వరన్ కూడా బాగా నటించింది. మహా పాత్రకు ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ లో మేఘనగా లావణ్య త్రిపాఠి నటన బబ్లీ బబ్లీగా అలరించింది. స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రేమ, స్నేహంల మధ్య దర్శకుడు కిశోర్ తిరుమల రాసుకున్న కథ మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది. ప్రధానంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా కాస్త స్లో నేరేషన్ లో నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ లో స్పీడ్ పెంచి ఉంటే బాగుండేది. ఇక మాస్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎడిటింగ్ మీద ఇంకా పని చేస్తే బాగుండేది.

మొత్తంగా :

లవ్, ఫ్రెండ్‍షిప్ కథలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది. అలానే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -