టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమాల విషయంలో ఆయన భార్య నమ్రత జోక్యం ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. కథల విషయంలో నమ్రత ఎటువంటి జోక్యం చేసుకోరు. కాని మహేశ్ ఎప్పుడు , ఎవరిని కలవాలో మాత్రం డిసైడ్ చేసేది మాత్రం నమ్రతనే. తాజాగా నమ్రత అల్లు అరవింద్‌ను కలవడం పెద్ద చర్చనీంయాంశంగా మారింది. సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అవ్వడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మహేశ్‌తో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అరవింద్. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వం వహించనున్నారు. అయితే సుకుమార్ సినిమా తరువాతే సందీప్ వంగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేశ.
కాకపోతే సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ కావడంతో సందీప్ వంగాతో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాడట మహేశ్. మధ్యలో అనిల్ రావిపూడి వచ్చిన,అతను ఇంకా కథను రెడీ చేయకపోవడంతోనే సందీప్ వంగాను లైన్లో పెట్టాడట మహేశ్. ఇప్పటికే సందీప్ వంగా చెప్పిన కథకు మహేశ్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. దీనిలో భాగంగానే మహేశ్ భార్య నమత్ర అల్లు అరవింద్‌ను కలిసినట్లు సమాచారం. మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తి అవ్వగానే సందీప్ వంగాతో సినిమా చేస్తాడని సమాచారం.
- Advertisement -
మహేశ్ భార్యతో అల్లు అరవింద్ మీటింగ్ దేనికోసం….?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
