- Advertisement -

వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

- Advertisement -

వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా తన నివాసంపై జరిగిన దాడి, తనపై నమోదు చేసిన కేసులు, అలాగే పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

తన ఇంటిపై జరిగిన దాడి రాజకీయ ప్రేరేపితమని అంబటి రాంబాబు ఆరోపించినట్లు తెలుస్తోంది. అలాగే తనపై నమోదు చేసిన కేసులు అక్రమమని, అవి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకే పెట్టినవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నింటిపై పూర్తి వివరాలతో పార్టీ అధినేతకు నివేదించినట్లు తెలిసింది.

వైసీపీ తరఫున ఈ అంశంపై తగిన విధంగా పోరాడాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -