Sunday, May 19, 2024
- Advertisement -

బీజేపీ కన్ఫ్యూజన్ పాలిటిక్స్!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ సారి షర్మిలకు నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పి బలపడాలని భావిస్తుండగా బీజేపీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసిన బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం 0.5 శాతం ఓట్లు మాత్రమే రాగా పొత్తు విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతోంది.

బీజేపీ అధిష్టానం సైతం పెద్దగా ఏపీపై దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని స్థానిక బీజేపీ నేతలు సూచిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఇష్టపడటం లేదు. గతంలో చంద్రబాబుతో రాజకీయ స్నేహం, చేదు అనుభవాల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి జనసేనతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. కానీ టీడీపీ తో కలవడంపై హైకమాండ్ దే తుది నిర్ణయం అని చెప్పుకొచ్చారు.మరోవైపు అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే బీజేపీలో మాత్రం ఎలాంటి చలనం లేదు. దీంతో ఒకానొక దశలో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టి పొత్తా లేదా సింగిల్‌గా పోటీనా అన్నదానిపై క్లారిటీ ఇస్తుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -