Tuesday, April 30, 2024
- Advertisement -

రాజమండ్రి ఓటర్లు ఎవరి వైపు!

- Advertisement -

రాజమండ్రి పార్లమెంట్…ఇక్కడి నుండి గెలిచిన ఎంపీలు కేంద్రమంత్రులుగా పనిచేశారు. అందుకే ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉండగా ఈసారి సైతం ఆసక్తికర పోరు జరుగుతోంది. కూటమి తరపున బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ప్రముఖ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

రాజమండ్రి ఎంపీ స్థానం పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి,కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు ఉన్నాయి. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 11 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి తీర్పు ఎవరి వైపు ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఈ లోక్‌సభ పరిధిలో కేవలం ఒకే ఒక సీటు అనపర్తి నుండి బీజేపీ పోటీ చేస్తుండగా అక్కడ టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇక వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్‌కు డాక్టర్‌గా మంచి పేరుంది. రాజానగరం, అనపర్తి స్థానాల్లో వైసీపీ బలంగా ఉండగా ఇక్కడ భారీ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలులో రెండు పార్టీలకు తగ్గపోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కూటమి తరపున బరిలో ఉన్న పురందేశ్వరి తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ఎన్టీఆర్, మోడీ ఇమేజ్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు ఎన్నికల వ్యూహాలను రచిస్తుండగా విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -