Tuesday, April 30, 2024
- Advertisement -

పదిలో బీజేపీ గెలిచేది ఎన్ని?

- Advertisement -

ఏపీలో ఈసారి బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా చంద్రబాబు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా జనసేన 21,బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాయి. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ ఎన్నికల ప్రచారంలో మునిగిపోగా బీజేపీ మాత్రం ఇంకా సైలెంట్ మోడ్‌లోనే ఉంది.

దీంతో బీజేపీ వ్యూహామెంటో తెలియక నేతలు తల పట్టుకుంటున్నారు. ఇక ఏమాత్రం బలం లేని స్థానాలను బీజేపీకి ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కొన్ని స్థానాలను మార్చే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వనపర్తి, ఉండి అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం పార్లమెంట్ సీటులో మార్పు చేయాలని టీడీపీ భావిస్తోంది.

ఉండి స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన నరసాపురం ఎంపీ స్థానాన్ని తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీనికి తోడు టీడీపీ,జనసేన ఎన్నికల ప్రచారానికి బీజేపీ కేడర్ గైర్హాజరవుతోంది. ఇదే ఇప్పుడు ఈ రెండు పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే టీడీపీ నేతలు బీజేపీకి కేటాయించిన కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కోసం పనిచేస్తున్న పరస్పర అవగాహనక మాత్రం ఉండటం లేదు. ఇక త్వరలో నామినేషన్ల పర్వం ప్రారంభంకానుండగా బీజేపీ నేతలు ఎప్పుడు ప్రచారాన్ని మొదలు పెడతారోనన్న అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అన్నది ప్రశ్నార్థకంగానే మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -