Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌ను మించి జనసైనికులు అతిచేస్తున్నారా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్‌ మేనరిజంలో చాలా తేడా వచ్చింది. ఇక టీడీపీ – జనసేన పొత్తుతో జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు పవన్‌. రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే ముందు వందకాదు వెయ్యిసార్లు ఆలోచించాలి. కానీ ఇదేమీ చేయని పవన్‌ .. వ్యూహాత్మకంగా వ్యవహరించి వుండాల్సింది పోయి తొందరపడి హంగామా చేశారు. టీడీపీతో స్నేహంపై మితి మీరిన వ్యాఖ్యలు, చంద్రబాబుపై అమితమైన ప్రేమ చూపించడంపై టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుకి తానే బ్యాక్ బోన్‌లా నిలిచాననే గుడ్డి నమ్మకంతో పవన్ ఉన్నారని కామెంట్‌ కూడా చేస్తున్నారు.

ఇక పవన్ పరిస్థితే ఇలా ఉంటే జనసైనికుల అతి చూస్తే నవ్వురాకమానదు. టీడీపీతో పొత్తు కుదిరితే సగం సీట్లు జనసేనకు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. అసలు ఇది ఏ విధంగానూ సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే పవన్‌కు 30కి మించి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు తమవేనని చెప్పుకుంటూ అన్ని చోట్ల నుంచి జనసేన నుంచి ఆశావహులు పోటీకి తయారయ్యారు. జనసేన టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను ఒకేచోట కడుతూ సందడి చేస్తున్నారు. జనసేనకి మొత్తం ఇచ్చేదే 30 సీట్లు దాటని పరిస్థితి కానీ ఈ రెండు జిల్లాల నుండే 34 సీట్లు మావేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడం పెద్ద కామెడీనే. ఇక వాస్తవానికి జనసేనకు గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ లేదు. ఇదే విషయాన్ని పవన్‌ సైతం అంగీకరిస్తారు. ఎందుకంటే రీసెంట్‌గా జనసైనికుల సమావేశంలో ఇంకా క్యాడర్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు కూడా.

వాస్తవానికి జనసేతో పొత్తు అంటే టీడీపీలో కూడా ఈ జోష్ ఉండాలి… కానీ వారిని మించి జనసేనలో ఉండటం అర్ధం కాని పరిస్థితి. ఏదిఏమైనా అతి తగ్గించుకుని వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే మంచిదని పలువురు జనసైనికులకు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -