- Advertisement -

సంతకాల సేకరణ..విజయవాడ టాప్‌

- Advertisement -

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంచి స్పందనవచ్చింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 95 వేలకు పైగా సంతకాలు సేకరించడం పట్ల ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా ఏకమవ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

అవినాష్ మాట్లాడుతూ… జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడూ విజయవంతమవుతుంది. దీనిని స్వయంగా జగన్ కూడా ప్రశంసించారు అని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని, ఈ ప్రమాదాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

కడియాల బుచ్చిబాబు చేసిన కష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, నిరంతరం ప్రతిరోజూ పనిచేయడం వల్లే ఇంత భారీ సంఖ్యలో సంతకాల సేకరణ సాధ్యమైందని అవినాష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడం ప్రజల ఆవేదనను, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చలేదని, జగన్ గారి పాలనలో అమలైన పథకాలు ఎంత విలువైనవో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేసినా, ప్రజలు జగన్ గారి వెనుకనే నిలబడుతున్నారని అవినాష్ స్పష్టం చేశారు.

గద్దె రామ్మోహన్ అవినీతి ఇప్పుడు వెలుగులోకి వస్తోందని, చోటుచోట్ల అనుచరుల ద్వారా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అక్టోబర్ 10 నుంచి జగన్ గారి పిలుపుతో ప్రారంభించిన ఈ సంతకాల ఉద్యమం ప్రజల ఆగ్రహాన్ని, న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -