Monday, May 20, 2024
- Advertisement -

అగాధంలో ఆంధ్రా పెద్ద…భవిష్యత్‌ ప్రశ్నార్ధకమేనా?

- Advertisement -

45 ఏళ్ల రాజకీయ చరిత్ర…వ్యవస్థలను మేనెజ్ చేశారని అపఖ్యాతి వెరసీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయనను నమ్ముకున్న వారి భవిష్యత్‌ అగాధంలోకి నెట్టివేయబడింది. చంద్రబాబు రిమాండ్ తర్వాత లోకేష్, ఆ తర్వాత బ్రాహ్మణీ ఇలా అంతా అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనంతటికి కారణం చంద్రబాబు స్వయంకతపరాధమే.

చంద్రబాబు అరెస్ట్ వెనుక ప్రధాన సూత్రధారి జగనే అయినా వెనుకుంది మాత్రం బీజేపీ పెద్దలే. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుండి చంద్రబాబు బయటకు రావడం వరకు బాగానే ఉన్నా ప్రధాని మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బాబు తప్పుచేశారని ఆ తర్వాత ఆయనకు అర్ధమైంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా ఇప్పుడు కేంద్ర పెద్దల వంతు వచ్చింది. దీంతో ఇప్పుడు బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు …తన తనయుడు లోకేశ్‌కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి.. జనంతో మమేకమై పార్టీని పటిష్ట పర్చుకోవాల్సిన తరుణంలో లోకేశ్‌ని కేబినెట్‌లో తీసుకోవడం ఆయన చేసిన మరో తప్పు అని విశ్లేషకుల భావన. అదే ఇప్పుడు లోకేష్‌ని అరెస్ట్ చేసే వరకు వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బాబు సీఎంగా ఉన్నప్పుడు షాడో సీఎంగా వ్యవహారించారు లోకేష్. మంత్రుల పీఎల దగ్గరి నుండి ఎవరి నియమించాలో అంతా చినబాబు కనుసన్నల్లోనే జరిగింది. ఇక చినబాబు అనుచరులు చేసిన అవినీతి టీడీపీకి మరింత మైనస్‌గా మారింది.

ఇక బాబు అధికారంలో ఉన్నంతకాలం వ్యవస్థలను విజయవంతంగా మేనేజ్ చేశారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటన్నంటిని మేనెజ్ చేస్తూ సత్యహరిశ్చంద్రుడిలా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు సీనంతా రివర్స్‌. బాబుపై అవినీతి కేసులను నిరూపించడం వైఎస్ వల్ల కాలేదు..కానీ జగన్‌ మాత్రం పక్కా ఆధారాలతో నిరూపించి టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే అదునుచూసుకుని చంద్రబాబుకు జగన్‌ పక్కా రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక చంద్రబాబుపై నమోదైన కేసు అంశం ఇప్పట్లో తేలేది కాదు. కోర్టుల్లో విచారణ జరిగి నిజనిర్ధారణ జరిగే సరికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు జరగాల్సింది జరిగిపోతుంది. అయితే టీడీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజాక్షేత్రంలో ఆ పార్టికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఓవరాల్‌గా ఆంధ్రాకు పెద్దన్నని చెప్పుకునే బాబు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని అంతా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -