Sunday, May 5, 2024
- Advertisement -

అందుకే టీటీడీపీ పోటీ నుండి తప్పుకుందంట!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల రేసు నుండి టీటీడీపీ తప్పుకుంది. దీంతో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. అయితే టీటీడీపీ పోటీ నుండి తప్పుకోవడం వెనుక చంద్రబాబు లెక్కలు ఆయనకున్నాయి. గతమెంతో ఘనం అన్నట్లు తెలంగాణలో టీడీపీకి మంచి పట్టు ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీకి షిఫ్ట్ అయి పోయింది. ఇక ప్రస్తుతం టీటీడీపీ కమిటీ ఉన్నా అది నామమాత్రమే.

అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసినా కనీసం ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుతామని బాలయ్య ప్రకటించడం ఆ వెంటనే టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ఏకంగా 85 స్థానాల్లో పోటీ చేస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. కానీ ఆ సంతోషం టీటీడీపీ నేతల్లో ఎక్కువ సేపు నిలవలేదు.

టీటీడీపీ పోటీ చేయడం కంటే సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనే చెప్పారట చంద్రబాబు. ఎందుకంటే పోటీ చేస్తే నామమాత్రానికి పరిమితం కావాలి. పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. దీనికి తోడు ఏపీలో టీడీపీ సిచ్యువేషన్ అంతగా బాలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో ఒక్క సీటైనా గెలవకపోతే అది ఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కాసాని పోటీపై ఎంత ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు మాత్రం నిరాకరించారని తెలుస్తోంది. జైలులో ఉన్న చంద్రబాబు ఆలోచించింది కరెక్టేననన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -