Wednesday, May 15, 2024
- Advertisement -

కాంగ్రెస్ అంటేనే కల్లోలం..కలిసిపోవడం సాధ్యమేనా?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లోలం. ఆ పార్టీ నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికి అర్ధం కాని పరిస్థితి. జెర్ర ముందుకు పోతుంది అనుకుంటుండగానే ఎవరో ఒకరు బాంబు పేలుస్తారు. ఇది ఇప్పటివరకు కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. ఇక ఎన్నికలు వచ్చి టికెట్లు కేటాయిస్తున్నారంటే..గాంధీ భవన్ సంగతి చెప్పనక్కర్లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు గాంధీ భవన్‌ను రచ్చ రచ్చ చేయడం, తాళం వేయడం కామన్. ఇక ఇప్పుడు ఇదే టెన్షన్ పట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.

అందుకే అభ్యర్థుల ఎంపిక కొలిక్కివచ్చినా ప్రకటించడానికి జంకుతున్నారు. ఇక ఎన్నడూ లేని విధంగా పైకి ఐక్యమత్యంగా సాగుతున్న ఓ సారి లీస్ట్ బయటికొస్తే చాలు గాంధీ భవన్‌ భగ్గుమనాల్సిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కార్యకర్తలే. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు అధికారం కొల్పోయినా క్యాడర్‌లో మాత్రం ధైర్యం సడలలేదు. ఈసారి ఎలాగైనా జనంలో ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో క్షేత్రస్ధాయిలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనన్న వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో ప్రజలను మరింతగా ఆకర్షించింది. అయితే దీనిని ఎంతవరకు క్యాచ్ చేసుకుంటారనేది కాంగ్రెస్ నేతలకే తెలియాలి.

ఇక మరో వారం రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లీస్ట్ రానుండగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లను అధిష్టానం నియమించింది. టికెట్ రానివారిని, పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యత ఈ కమిటీ పని. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా టికెట్ రాని నేతలు ఎవరెన్ని చెప్పినా పార్టీ మారడం ఖాయం. గతంలో అనేక సందర్భాల్లో జరిగింది ఇదే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా విడిపోయారు కార్యకర్తలు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ప్రేమ ఉన్న నేతల వైఖరితో అటు కార్యకర్తలు సైతం విస్తుపోయే పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా వారం రోజుల్లో కాంగ్రెస్ లిస్ట్ వెలువడితే హస్తం పార్టీ నేతలు కలిసిపోయేది?లేనిది తెలియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -