Sunday, May 19, 2024
- Advertisement -

మద్దతిచ్చిన షర్మిలను పట్టించుకునే వారేలేరా?

- Advertisement -

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు వైఎస్ షర్మిల. కాలుకు బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత తన మనసు మార్చుకుని కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. కానీ కాంగ్రెస్ నుండి సానుకూలత రాకపోవడంతో సింగిల్‌గానే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట చీలకూడదనే పోటీకి దూరంగా ఉంటున్నానని తెలిపిన షర్మిల…అన్‌కండీషనల్‌గా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం చేయడం ఖాయమని అంతా భావించారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ మేరకు రాహుల్ గాంధీకి లేఖ సైతం రాశారు షర్మిల. అయితే ఇప్పటివరకు షర్మిల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి ఉలుకు పలుకు లేదు.

చివరకు రాహుల్ నుండి సైతం షర్మిలకు ఎలాంటి సమాచారం అందలేదు. ఇక కాంగ్రెస్ అగ్రనేతల సంగతి పక్కన పెడితే పాలేరు నుండి పోటీలో ఎవరి కోసం తప్పుకుందో ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం స్పందించని పరిస్థితి. వాస్తవానికి పొంగులేటికి వైఎస్ కుటుంబానికి మంచి సంబంధం ఉంది. షర్మిల సైతం పొంగులేటిని శ్రీనన్న అని పిలిచే సాన్నిహిత్యం. కానీ ఆయన కూడా షర్మిలకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దీంతో షర్మిల పరిస్థితి ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -