- Advertisement -

కదం తొక్కిన కాక్రోచ్ సైన్యం.. అల్టిమేటం..!

- Advertisement -

ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారిన పేరు కాక్రోచ్ పార్టీ. మీడియాలో ఒక సెటైరికల్ ఉద్యమంగా మొదలైన ఈ CJP, ప్రస్తుతం వేలాది మంది యువత మద్దతుతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అభిజీత్ దిప్కే అనే 30 ఏళ్ల యువకుడు ప్రారంభించిన ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో మద్దతు లభిస్తుంది. ఈ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు అనూహ్యంగా స్పందన వచ్చింది. ప్రభుత్వం ముందు ఈ పార్టీ కొత్త డిమాండ్ ఉంచింది. ఈ ధర్నా.. మద్దతు రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణంగా మారుతోంది.

కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నా పైన రాజకీయంగా ఫోకస్ పెరిగింది. CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు ఇతర నాయకులు, అలాగే వేలాది మంది విద్యార్ధులు జంతర్ మంతర్ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ నేపధ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఆయన రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని CJP చీఫ్ అభిజీత్ స్పష్టం చేసారు. NEET-UG, CUET, CBSE తదితర కీలక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. పరీక్షల కుంభకోణాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపిస్తూ ఈ ధర్నా కు పిలుపునివ్వగా భారీగా స్పందన వచ్చింది.

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్​చుక్‌ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దిప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాలపాటు నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. నిరసనలో పాల్గొనే యువత శాంతియుతంగా వ్యవహరించాలని, అధికారులతో సహకరించాలని సూచించారు. నీటి సీసాలు, మొబైల్ ఫోన్లు వంటి అవసరమైన వస్తువులనే వెంట తీసుకురావాలని చెప్పారు. పూలు తీసుకురావాలని కూడా ప్రోత్సహించారు. అలాగే ఎవరైనా ఆయుధాలు లేదా అనుమానాస్పద వస్తువులు తీసుకువస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉద్యమం హింసాత్మకంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఆందోళన.. సమస్యలు లేకుండా కాక్రోచ్ పార్టీ ధర్నా నిర్వహించటం సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -