Sunday, May 19, 2024
- Advertisement -

హరీష్ దెబ్బకు పవన్ క్లీన్ బోల్డ్.. డిఫెన్స్‌లో బీజేపీ?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల పర్వం నేటి నుండి మొదలుకాగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకుంది. తాను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నానని…కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో షర్మిల నిర్ణయంపై ఆ పార్టీ శ్రేణులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు.

ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా రేపుతున్నాయి. ఎన్నికల వేళ తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తో బీజేపీ చేతులు కలిపితే కాంగ్రెస్‌తో షర్మిల జట్టుకట్టిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్… తెలంగాణ రావడం ఇష్టం లేదు అని భోజనం మానేశాడని…అలాంటి పార్టీకి లోపలి నుండి చంద్రబాబు మద్దతిస్తున్నారని పవన్‌ని తెలంగాణ ద్రోహిని చేసేశారు.

ఇక బీజేపీ నేత లక్ష్మణ్‌…పవన్ ప్రచారం నిర్వహిస్తారని చెప్పగా ఈ రెండు పార్టీలు జోష్‌లో ఉన్నాయి. ఇంతలోనే పవన్‌ని తెలంగాణ ద్రోహిని చేసి జనసేనానిని క్లీన్ బోల్డ్ చేయగా బీజేపీని డిఫెన్స్‌లో పడేశారు. ఇప్పటికే సీమాంధ్ర మూలాలు అంటూ టీడీపీ చాప్టర్‌ని తెలంగాణలో క్లోజ్ చేసింది బీఆర్ఎస్‌. అలాగే పవన్‌ సైతం ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసింది లేదు…ఇక ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేద్దామని ఉవ్విళ్లూరు తుండగా పవన్‌పై ఆంధ్ర ముద్ర వేసేశాడు. మరి ఆంధ్ర వేసిన పవన్‌…బీజేపీ తరపున ప్రచారం చేస్తే ఓట్లు రాలుతాయా..?అన్నది సందేహామే. ఎందుకంటే మహాకూటమి పేరుతో 2018 ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి పోటీచేయగా తెలంగాణ వాదానికే జై కొట్టిన ప్రజలు బీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. తాజాగా పవన్‌తో బీజేపీ జట్టు కట్టడం ఆ పార్టీకి పూర్తిగా మైనస్‌. ఇలాంటి తరుణంలో హరీష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బ్యాక్ స్టెప్ వేస్తుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -