Monday, May 20, 2024
- Advertisement -

పవన్‌…కాకినాడ కన్ఫామేనా?

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రాజకీయ ఎత్తుగడలకు పని చెబుతున్నాయి. ఇక ముఖ్యంగా జగన్‌ సిట్టింగ్‌లను పెద్ద ఎత్తున మారుస్తు ఎక్కడా అసమ్మతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎటొచ్చి టీడీపీ – జనసేన కూటమికే ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే టికెట్ రాని నేతలు ఈ రెండు పార్టీలపై తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో ఇప్పటికి స్పష్టత రాని పరిస్థితి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చినా పవన్ రెండు చోట్ల పోటీ చేయడం ఖాయం. ఇక పవన్ పోటీ చేసే స్థానంపై రోజుకో వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా పవన్ పోటీ చేసే లిస్ట్‌లో కాకినాడ పేరు తెరపైకి వచ్చింది.

అందుకే కాకినాడను సొంత నియోజకవర్గంగా మర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంబించారని జనసేన నేతలు చెబుతున్నారు. వార్డుల వారిగా నేతలతో సమావేశం నిర్వహిస్తూ కాకినాడలో పోటీ చేసే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట పవన్. మరో రెండు మూడు రోజుల్లో పవన్ కాకినాడలో పర్యటించనున్నారు. ఇక తన టూర్ సందర్భంగా సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ చేయగా జనసైనికులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. కాకినాడ నుంచి పోటీ చేస్తే.. కాకినాడ జిల్లాలో ఉన్న పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కాకినాడ జిల్లా కాపు ప్రభావిత ప్రాంతం ఇది కూడా కలిసివస్తుందని అందుకే పవన్‌కు సేఫెస్ట్ ప్లేస్ అంతా భావిస్తుండగా మరి పవన్ నిజంగానే కాకినాడ నుండి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -