Sunday, May 19, 2024
- Advertisement -

జేడీ..జై భారత్ మేనిఫెస్టో ఇదే

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జనాకర్షక పథకాలతో మేనిఫెస్టోను రూపొందించారు జేడీ.

ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతి పంచాయతీలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకోస్తామని తెలిపారు. పట్టణ ఉపాధి హామీ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజుల ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల నోటీఫికేషన్ విడుదల చేస్తామని,జాబ్ షెడ్యూల్ రిపబ్లిక్ డే నుండే మొదలవుతుందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేష్, అక్టోబర్ 21న సర్దార్ వల్లాభాయ్‌ పటేల్ జన్మదిన సందర్భంగా కానిస్టేబుల్, ఎస్సై నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు.

పంచాయతీ, మున్సిపాలిటీల్లో 50 వాతం మంది మహిళలు వాళ్ల ప్రాంతంలో మద్యం షాపులు వద్దు అంటే వాటిని మూసివేస్తామని, మహిళ చేతిలోనే మద్యపాన నిషేధం అమల్లో ఉండేలా చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కోటి రూపాయల గ్రాంట్ ఇస్తామన్నారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఆదర్శ గ్రామాలకు కోటి రూపాయల ప్రోత్సాహం అందిస్తామని, సబ్సిడీపై ప్రతి ఇంటికి సోలార్ పానెల్స్, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం,ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్ధాయి ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -