- Advertisement -

హార్మూజ్ జలసంధి..అలా దాటగలిగాం!

- Advertisement -

ఇరాన్ యుద్ధ పరిస్థితుల మధ్య కూడా భారత నౌకలు హార్మూజ్ జలసంధి గుండా ఎలా ప్రయాణించగలిగాయి అనే ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టత ఇచ్చారు. ఇరాన్‌తో భారతదేశానికి ఎలాంటి “స్థిరమైన లేదా సాధారణ ఒప్పందం” లేదని ఆయన తెలిపారు. సంభాషణ, సమన్వయం మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో అనేక దేశాల నౌకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే భారతదేశం ఇరాన్‌తో నేరుగా చర్చలు జరపడం వల్ల భారత జెండా ఉన్న కొన్ని నౌకలు సురక్షితంగా ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించగలిగాయని జైశంకర్ తెలిపారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మార్గాన్ని రక్షించేందుకు అనేక దేశాలు యుద్ధనౌకలను పంపాలని కోరిన సంగతి తెలిసిందే.

ఓ ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ, ఇరాన్‌తో భారత నౌకల ప్రయాణానికి సంబంధించి ఎలాంటి సాధారణ ఒప్పందం లేదన్నారు. అయితే టెహ్రాన్‌తో జరుగుతున్న చర్చల ఫలితంగా రెండు భారత ఎల్‌ఎన్‌జీ గ్యాస్ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లగలిగాయని చెప్పారు.

మేము ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నాం. కొంత ఫలితం కూడా వచ్చింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు వస్తే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం అని జైశంకర్ తెలిపారు. అలాగే భారత నౌకల ప్రయాణానికి బదులుగా ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం హోర్ముజ్ ప్రాంతంలో ఇంకా పలు భారత నౌకలు ఉన్నాయని, వాటి ప్రయాణం విషయంలో కూడా చర్చలు కొనసాగుతున్నాయని జైశంకర్ వెల్లడించారు. ప్రతి నౌక ప్రయాణాన్ని విడివిడిగా పరిశీలిస్తూ అనుమతులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశం–ఇరాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండటం వల్లే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించే అవకాశం లభించిందని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -