Monday, May 20, 2024
- Advertisement -

యాక్టివ్ అయిన వైఎస్ ఆత్మ?

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. ఎమ్మెల్యేగా గెలవనప్పటికి చక్రం తిప్పిన నేత. ముఖ్యమంత్రి ఆత్మగా పనిచేసిన ఆయనంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరూ. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా?. కేవీపీ. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే సీఎంగా వైఎస్ ఒకవైపు అయితే ఆయన ఆత్మగా,నీడగా నడిచిన వ్యక్తి రామచందర్‌రావు. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.

ఎంతలా అంటే కేవీపీ చెబితే వైఎస్ చెప్పినట్లే. ఉన్నతాధికారులు సైతం కేవీపీ చుట్టూ ప్రదిక్షణ చేసేవారంటే ఆయనకు వైఎస్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అయితే వైఎస్ మరణం తర్వాత కేవీపీ ప్రభ మసకబారింది. తర్వాత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా కేవీపీని పెద్దగా పట్టించుకోలేదు. రామచందర్‌రావు సైతం రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ప్రస్తుతం మనసు మార్చుకున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి సారించారు.

ఏపీపైనా కాంగ్రెస్ ఫోకస్ చేయడం, వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్‌గా ఉండటంతో తిరిగి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు కేవీపీ. షర్మిలతో కలిసి ఇడుపులపాయకు వచ్చిన కేవీపీ.. అక్కడి నుంచి విజయవాడలో షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే ఆమె వెంటే నడిచారు. ఇక షర్మిల తనకు మేనకోడలని..సీనియర్లందరిని పార్టీలో యాక్టివ్ చేయడమే తన ముందున్న కర్తవ్యమని చెబుతున్నారు కేవీపీ. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో వైఎస్ ఆత్మ యాక్టివ్ అయిందని మాట్లాడుకుంటున్నారు.నాడు తండ్రికి నేడు కూతురుకు కేవీపీ అండగా ఉండటం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి వీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌కు గత వైభవాన్ని తీసుకొస్తారో లేదో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -