Sunday, May 19, 2024
- Advertisement -

కాపులను తాకట్టు పెట్టిన పవన్‌!

- Advertisement -

చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడతావని మండిపడ్డారు వైసీపీ నేత మేడ గురుదత్త ప్రసాద్. ఇటీవలె జనసేన నుండి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు గురుదత్త ప్రసాద్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి రాజకీయ నాయకుడికి తన పార్టీ, తన నాయకులు ఎదగాలని కోరుకుంటారు కానీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం ‘పక్క పార్టీ నాయకులు’ ఎదగాలని కోరుకుంటారన్నారు.

రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పదే పదే అంటున్నారు. పదవి అవసరం లేదని ఎవరితో చర్చించి చెప్పారు…? నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయం సరిపోతుంది అనుకుంటే, నీ వెనకాల నీ పార్టీను నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి..? నీ వెంట నడిచిన కాపు నాయకుల సంప్రదింపులు నీకు అవసరం లేదా..? అని ప్రశ్నించారు. ఒక్కసారి వీర మరణాలు అవసరం లేదు అంటావ్..మరో సారి అధికారమే వద్దు అంటావ్..మరి ఎం చూసి నీ వెంట కాపులు నడవాలి. వారి ఆశయాలకు సాధకుడిగా నిన్ను, నీ పార్టీ జెండాని ఎత్తుకుంటే నువ్వు మాత్రం ‘నాకు ఎటువంటి ఆశలు లేవు అని, నీ వెంట నడిచిన వారి గౌరవాన్ని మంటలో కలిపేస్తావ్’. దీన్ని సహించలేకే హరిరామ జోగయ్య లాంటి కాపు నాయకులు మండి పడ్డారని ఆరోపించారు.

పొత్తుని సమర్ధించనివారిని వైఎస్సార్ సీపీ కోవర్టులని అన్నావు. మరి ఎవరితో సంప్రదించకుండా కాపుల కోరికలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోకుండా…2018 లో నువ్వే అనేకసార్లు వీరిని నమ్మకూడదని చెప్పి ఈరోజు లోకేష్, చంద్రబాబులని ఆకాశానికి ఎత్తడం ఏంటో కాపులకి సమాధానం ఇవ్వాలన్నారు. అమ్మ ఎవరికైనా అమ్మే, ఆరోజు చంద్రబాబు ఎల్లో మీడియా మీ ఇంట్లో వారిని సోషల్ మీడియా వేదిక పైన లాగి అవమానిస్తే ఎంతో ఆవేదన చెంది ట్విట్టర్ పైన స్పందించారు. అలాంటిది మీరు కాపులని మల్లి వాళ్ళని నమ్మండి అని ఎలా అడుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని కాపులంతా జగన్‌ వైపే ఉన్నారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -