- Advertisement -

ఎంపీ కేశినేని చిన్నిపై కొలిక‌పూడిదే పైచేయి!

- Advertisement -

తిరువూరు రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ‘కొలికపూడి వర్సెస్ కేశినేని చిన్ని’ పోరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పైచేయి సాధించారు. తీవ్ర ఉత్కంఠ మరియు ఉద్రిక్తతల నడుమ జరిగిన మెప్మా (MEPMA) ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం ఘనవిజయం సాధించింది. ఎమ్మెల్యే మద్దతునిచ్చిన కూటమి అభ్యర్థిని మెజార్టీ సభ్యులు ఎన్నుకోవడంతో తిరువూరులో ఎమ్మెల్యే వర్గం పట్టు నిరూపించుకుంది.

మెప్మా కార్యాలయం వద్ద ఉదయం నుండి నెలకొన్న యుద్ధ వాతావరణం మధ్య ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సపోర్ట్ చేసిన జనసేన కార్యకర్త డెక్కా నవ్యకు మొత్తం 23 మంది సభ్యులు ఓటు వేసి గెలిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము విజయం సాధించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు.

విజయం అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఎన్నికలు సజావుగా నిర్వహిస్తుంటే ఎంపీకి వచ్చిన అభ్యంతరమేంటి? గెలవడం కోసం మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఆయన నిలదీశారు.

మీరు చేస్తున్న అక్రమాలను, రాచకాలను నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను. దమ్ముంటే నేను ఫలానా తప్పు చేశానని నిరూపించేలా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయండి.. దానికి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తా అని ఎంపీకి దమ్కీ ఇచ్చారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని, కేవలం చంద్రబాబు ఆశయాల సాధన కోసం, పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే ఇచ్చిన ఈ ఊహించని షాక్‌తో ఎంపీ కేశినేని చిన్ని వర్గం రగిలిపోతోంది. కిడ్నాప్ ఆరోపణలు, సభ్యుల నిర్బంధం వంటి పరిణామాల మధ్య ఎమ్మెల్యే వర్గం విజయం సాధించడం తిరువూరు టీడీపీలో పెను చర్చకు దారితీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -