Saturday, May 18, 2024
- Advertisement -

తిరుపతి లేదా భీమవరం…పవన్‌కే క్లారిటీ లేదా!

- Advertisement -

టీడీపీ – జనసేన సీట్ల పంపకంపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక జనసేనకు ఎన్ని సీట్లు, ఏయే స్ధానాలు కేటాయిస్తారనే దానిపై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో పవన్ రెండు స్ధానాల నుండి పోటీచేసి ఓడిపోయారు. ఇందులో జనసేన బలంగా ఉన్న భీమవరం ఒకటి. అయితే ఈ సారి కూడా రెండు స్ధానాల నుండి పోటీచేస్తారా లేదా అన్న క్లారిటీ లేకపోయినా ప్రాధమిక సమాచారం ప్రకారం భీమవరం నుండి పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది.

అయితే తాజాగా తిరుపతి పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనికి ప్రధానకారణం మెగాబ్రదర్ నాగబాబు వ్యాఖ్యలే. తిరుపతి జిల్లాలోని నేతలు, క్యాడర్ తో నాగబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుండి పోటీచేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాగబాబు స్వయంగా చెప్పారంటే పవన్ తిరుపతి నుండి బరిలోకి దిగడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే భీమవరంతో పాటు తిరుపతి రెండు స్ధానాల నుండి పోటీచేస్తారా లేదా తిరుపతి నుండి మాత్రమే బరిలోకి దిగుతారా అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

ఇక నాగబాబు సైతం అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బరిలోకి దిగారు నాగబాబు. అయితే వైసీపీ హవాలో ఆయనకు ఓటమి తప్పలేదు. కానీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుండగా అది ఉభయగోదావరి జిల్లాల్లోని ఓ స్ధానం ఉండబోతుందట. ఇక పవన్‌ తిరుపతి ఎంచుకోవడం వెనుక రాజకీయ పరమైన కారణంతో పాటు మెగా సెంటిమెంట్ కూడా ఉందట. గతంలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుండి పోటీచేయగా తిరుపతిలో గెలుపొందారు. అటు రాజకీయంగా టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉండటం మరోవైపు చిరు సెంటిమెంట్ కలిసివస్తుందని భావించారని అందుకే నాగబాబు…పవన్ పోటీపై ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -