Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు వక్రబుద్ది..

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తన వక్రబుద్దిని చాటుకున్నారు. పేదలకు లబ్ది చేకూరే పెన్షన్ పథకంపై మరోసారి తన పక్షపాతాన్ని చూపించారు. రాష్ట్రంలోని దాదాపు 70 లక్షలమంది పెన్షనర్ల పాలిట చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యారు. ప్రతినెలా ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పిన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్షగట్టారు… వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి.

తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైయస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన చంద్రబాబు తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్న చంద్రబాబు తన పన్నాగం ఫలించిందని సంబరపడ్డారు. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం… దీనికి చంద్రబాబే కారణం అని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్రవిచిత్రమైన రీతిలో తిట్టడం మొదలు పెట్టారు. బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. దీంతో వామ్మో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు….ఇపుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని…వృద్ధులు…వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు… చూసారా ? పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది… ఆ తరువాత వాళ్లపట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబేనని పలువురు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -