Sunday, May 19, 2024
- Advertisement -

షర్మిల సంచలనం..కాంగ్రెస్‌కే మద్దతు

- Advertisement -

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. తాను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తనను కాదన్న కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది షర్మిల. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందని…దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్నారు. తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని వేరుగా చూడలేదన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందని…అందుకే తాను కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నానని చెప్పారు.

ఇక పాలేరులో పోటీచేస్తానిన చెప్పి వెనక్కి తగ్గడంతో ప్రజలకు క్షమాపణ చెప్పారు. తనను కడుపులో పెట్టుకొని కాపాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపగా పాలేరులో తాను చేసిన ప్రతి పోరాటంలో పొంగులేటి శ్రీను అన్న తన వెంట ఉన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజున తమ కుటుంబానికి మద్దతుగా ఉన్నారని…ఇప్పుడు పాలేరు నుండి శ్రీనన్న పోటీలో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీనుండి వైదొలుగుతున్నానని చెప్పారు.

వాస్తవానికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. చివరకు కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ విధించారు. కానీ కాంగ్రెస్‌ షర్మిలను లైట్ తీసుకుంది. ఇక 119 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల చివరకు పోటీ నుండి తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -