Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కే..ఆధారం ఇదిగో?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు ఎవరికి షేర్ అవుతుందోనన్న సందేహం అందరిలో నెలకొంది. టీడీపీ ఓటు బ్యాంకును క్యాచ్ చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే పక్కగా టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు షేర్ అవుతుందని తేలిపోయింది. వాస్తవానికి టీడీపీ ఎన్నికల్లో పోటీకి దూరమైనప్పుడు అది కాంగ్రెస్‌కు అనుకూలంగా అని ప్రచారం జరిగింది.

ఎందుకంటే చంద్రబాబు అనుమతితోనే టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేశారు రేవంత్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏనాడూ చంద్రబాబును ఒక్కమాట అనలేదు. కానీ పొగిడిన సందర్భాలెన్నో. అందుకే బీఆర్ఎస్ నేతలు రేవంత్‌ని చంద్రబాబు ఏజెంట్ అని ఎన్నోసార్లు విమర్శించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం కావడంతో ఉన్న కాస్త ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్,బీఆర్ఎస్ ప్రయత్నించాయి. అందుకే పోటీపడి మరి బాబు అరెస్ట్‌ను ఖండించారు. ఇదంతో సీమాంధ్ర ఓట్ల కోసమేనని అందరికి తెలిసిపోయింది.

అయితే తాజాగా టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు షిఫ్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత నుండి టీటీడీపీ నేతలతో పాటు సెటిలర్లకు సంకేతాలు కూడా వెల్లాయట. ఇక దీంతో పాటు ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు…టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని పేరుతో రైతు ఉద్యమాలు నడిపింది శ్రీనివాసరావే. దీని వెనుక ఉంది టీడీపీనే అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి శ్రీనివాసరావు ఇప్పుడు రేవంత్‌తో భేటీ కావడంతో చంద్రబాబు ఆదేశాలతోనే ప్రచారం జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ త‌ర‌ఫున 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీ పరిరక్షణ సమితి తరుపన ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్ర‌చారం చేస్తామని ప్రకటించడంతో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు షిఫ్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీ పోటీకి దూరమవడం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -