Sunday, May 19, 2024
- Advertisement -

ఆ 19 స్ధానాలు ప్రకటిస్తే..కాంగ్రెస్ పని అంతేనా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్, కాంగ్రెస్ అసంతప్తులకు బీఆర్ఎస్ వేదిక కాగా ఇప్పటికే ప్రకటించిన రెండు లిస్ట్‌లో కాంగ్రెస్ అస్తవ్యస్తమైంది. కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడగా మరో 19 స్థానాలపై పీటముడి వీడటం లేదు. ఓ వైపు వామపక్షాలతో పొత్తు మరోవైపు సీనియర్ల బుజ్జగింపు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. నామినేషన్ల పర్వం మొదలుకావడంతో రెపో, మాపో లిస్ట్‌ను ప్రకటించనుండగా మూడో లిస్ట్ ప్రకటిస్తే కాంగ్రెస్ అల్లకల్లోలం కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఈ 19 స్థానాలపై నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు. ఈ 19 స్థానాల్లో ప్రధాన నేతల నియోజకవర్గాలు ఉండటంతో సీనియర్ నేతలు సైతం వేలు పెట్టేందుకు జంకుతున్నారు. కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన స్థానాల్లో వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ ఉన్నాయి .

ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యపేట అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా తుంగతుర్తి సీటును ఆశీస్తున్న ఆశావాహుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉంది. గత ఎన్నికల్లో సైతం చివరి వరకు నాన్చడంతో ఈ రెండు స్థానాలను స్వల్ప ఓట్లతో కొల్పోయింది కాంగ్రెస్. తాజా ఎన్నికల్లో కూడా అదే జరుగుతుండటం విశేషం. ఇక సీపీఎం ఇప్పటికే కాంగ్రెస్‌తో కటీఫ్ కాగా సీపీఐ మాత్రం వేచిచూసే దోరణిలోనే ఉంది. మూడో లిస్ట్ ప్రకటన లోనే సీపీఐతో పొత్తుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మూడో లిస్ట్ తర్వాత కాంగ్రెస్‌లో వచ్చే కల్లోలం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -