Sunday, May 5, 2024
- Advertisement -

ఆ 30 స్థానాల్లో త్రిముఖ పోరు..గెలిస్తేనే లేదంటే!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార బీఆర్ఎస్ – ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్ సాగుతోంది. ఇక తెలంగాణలో మొత్తం 119 స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 60. మజ్లిస్ పార్టీ గెలిచే 6 లేదా 7 స్థానాలను వదిలేస్తే మిగిలేది 112 స్థానాలే. ఇక ఇందులో 30 స్థానాల్లో త్రిముఖ పోరు ఉంటుందని వెలుగు దినపత్రిక వెల్లడించింది.

ఇక ఈ 30 స్థానాలను ఓ సారి పరిశీలిస్తే కరీంనగర్,మానకొండూరు,హుజురాబాద్,చొప్పదండి,మంథని,వేములవాడ,జగిత్యాల,కోరుట్ల,నిజామాబాద్ అర్బన్,ఆర్మూర్,ఆదిలాబాద్,నిర్మల్,ఖానాపూర్,సిర్పూర్,పటాన్ చెరు,హుస్నాబాద్,వరంగల్ తూర్పు,కల్వకుర్తి,ముథోల్,కామారెడ్డి,సూర్యాపేట,ఖైరతాబాద్,కుత్బుల్లాపూర్,ఎల్బీనగర్,శేరిలింగంపల్లి,ఉప్పల్,రాజేంద్రనగర్,మహేశ్వరం,మహబూబ్‌నగర్,మల్కాజిగిరి వంటి స్థానాలున్నట్లు వెల్లడించింది.

త్రిముఖ పోరు ఎదుర్కొంటున్న వారిలో మంత్రులు గంగుల కమలాకర్,జగదీశ్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి,రసమయి బాలకిషన్,మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ రాథోడ్ ఉన్నట్లు తెలపగా కాంగ్రెస్ నుండి కొండా సురేఖ,రాంరెడ్డి దామోదర్ రెడ్డి,విజయా రెడ్డి,మైనంపల్లి హనుమంతరావు,పొన్నం ప్రభాకర్,షబ్బీర్ అలీ వంటి నేతలున్నట్లు వెల్లడించింది.

ఇక బీజేపీ నుండి ప్రధానంగా రఘునందన్ రావు,బండి సంజయ్, ధర్మపురి అరవింద్,ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్,మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు,తల్లోజు ఆచారి,బొడిగే శోభ ఉన్నట్లు వెల్లడించింది. ఇక వీరంత కీలక నేతలు కావడంతో ఎన్నికల్లో గెలిస్తేనే సత్తా చాటే అవకాశం ఉంది. లేదంటే పొలిటికల్ కెరీర్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -