Saturday, May 18, 2024
- Advertisement -

బీజేపీకి మరో షాక్..రేవంత్‌తో వివేక్ భేటీ!

- Advertisement -

ఓ వైపు చేరికల జోష్…మరోవైపు గాంధీభవన్‌ ముందు నిరసనలు వెరసీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలకు అడ్డగా మారింది కాంగ్రెస్. అందుకే ఎంతమంది నేతలు నిరసనలు తెలుపుతున్న రోజు రోజుకు చేరికల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా బీజేపీ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు సీటు దక్కించుకోగా తాజాగా మాజీ ఎంపీ వివేక్‌ చేరికకు రంగం సిద్ధమైంది.

వివేక్‌తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇవాళో, రేపు తిరిగి సొంత గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వివేక్‌ ఎంపీగా బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా ఆయన బాటలోనే మరికొంత బీజేపీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

తాను బీజేపీతోనే ఉంటానని చెప్పిన వివేక్‌.. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వివేక్ అపాయిమెంట్‌ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మొత్తంగా సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -