Thursday, May 16, 2024
- Advertisement -

నలుపు షర్ట్స్ వేసుకుని ఎదురొస్తే నలిపేస్తా అంటున్న ఆ స్టార్ హీరో..!!

- Advertisement -

అది బంజారా హిల్స్‌లో ఉన్న శబ్దాలయ రికార్డింగ్ థియేటర్ సమయం ఉదయం 7 గంటలు దాటింది.. ఒక టాప్ హీరో ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి వస్తున్నాడు.. అని మేనేజర్ చెప్పగానే…

అక్కడి బాయ్స్ అందరూ అలర్ట్ అయ్యారు.. రికార్డింగ్ స్టూడియో అంతా స్ప్రే కొట్టి అంతా నీట్‌గా ఉంచారు.. ఈ లోగా మన స్టార్ వచ్చారు.. ఇంటి దగ్గర గత వారం నుండి డైలగ్స్ ప్రాక్టీస్ చేసుకుని డబ్బింగ్ ఇరగదీద్దామని వచ్చాడు.. కార్ గేట్ దాటి లోనికి వచ్చింది. స్టార్ హీరో వచ్చాడని తెలుసుకున్న ఆ స్టూడియో మేనేజర్ కాఫీ తాగడం ఆపేసి.. మరీ లేచి చేతులు కడుక్కుని వస్తున్నాడు.. 

ఎందుకంటే ఒకవేళ మన స్టార్ హీరో ఆ మేనేజర్‌ కి షేక్ హ్యాండ్ ఇస్తే చేయి కాఫీ వాసన వస్తే బాగోదు అని చేయి కడుక్కున్నాడు.. ఇంతలోనే అక్కడ ఒక సంఘటన జరిగింది.. మన స్టార్ హీరో లోనికి ఎంటరయ్యాడు. స్టూడియో రూం నుండి ఒక బాయ్ ఫ్రెష్ గా బయట కొచ్చాడు. ఎందుకంటే తన అభిమాన నటుడిని దగ్గర నుండి చూడొచ్చు అని…. చిన్నప్పటి నుండి తన అభిమాన హీరో డ్యాన్స్‌లు ఫైట్స్, డ్రెస్‌లు, అన్నింటికి మించి డైలగ్స్ కోసం సినిమా హాల్ లో షర్ట్స్  చింపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అతని డైలాగ్స్ వింటే థియేటర్ దద్దరిల్లాలి.. విలన్ గుండెలు బద్దలవ్వాలి.. అలా ఉంటాయి.. మన హీరో మాటలు అవన్ని ఉహించుకొంటూ రాత్రి అంత నిద్ర పట్టలేదు.. ఎలాగో అలాగు రాని నిద్రని కళ్ళలో కుక్కుకున్నాడు.. మొత్తానికి ఎంతో కొంత నిద్రపోయాడు.అది రాత్రి.. ఇక ఇప్పుడు తను రూమ్‌ నుండి బయటికొచ్చాడు.

ఎదురుగా తన అభిమాన హీరో.. ఇద్దరూ కొంచెం దూరంలోనే ఉన్నారు..మన హీరో ఏదో మాట్లాడుతూ.. నవ్వుతూ వస్తున్నాడు.. ఒక్కసారి ఆగాడు.. ఎదురుగా ఒకన్ని చుశాడు.. మన హీరో ఫేస్‌లో ఎర్రని మంటలు చెలరేగాయి.. ఆ బాయ్ ఫేస్‌లో మన హీరోని చూసిన ఆనందంలో వెన్నెల విరిసింది.. ఇద్దరి మద్యన ఒకే ఒక అడుగు దూరం ఉంది. పోరా లండి కొడకా నాకే ఎదురొస్తావా.. అది ఈ black shirt వేసుకుని అని ఒక్కసారిగా ఆ బాయ్‌ని కొట్టేశాడు.. కొద్ది దూరంలోనే ఉన్న studio మేనేజర్ మధ్యలో కలుగజేసుకుని.. sir pls.. ఆగండి…వాడికి తెలియదు.. వాడు మొన్ననే వచ్చాడు.. pls.. అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు… ఇంతలో ఆ సినిమా డైరెక్టర్.. co-డైరెక్టర్ వచ్చారు.. మన హీరో కొంచెం cool అయ్యాడు.. ఆ కుర్రాడు పారిపోయాడు… నా మూడ్ అవుట్ అయ్యింది.. 

నేను ఈ రోజు డబ్బింగ్ చెప్పను అని కొద్ది దూరం నడిచిన మన హీరో కార్ దగ్గరికి వచ్చి ఆగి ఒక్క క్షణం ఆలోచించాడు.. ఎందుకంటే మన హీరో ప్రొడ్యూసర్స్ హీరో, డైరెక్టర్స్ హీరో.. దర్శకులు ఏది చెబితే అది చేస్తాడు..ప్రొడ్యుసర్స్‌ కి ఒక్క పైసా నష్టం రానివ్వడు.. వెనక్కి వచ్చి ok డబ్బింగ్ చెబుతా… ఆ లండి కొడుకు ఉన్నాడా.. వెళ్ళాడా… అని అన్నాడు… ఎపుడో వెళ్ళాడు సార్ అని మేనేజర్ అన్నాడు.. అప్పుడు మన హీరో డబ్బింగ్ చెప్పడం start చేశాడు…ఇంతకీ ఆ boy ని మన హీరో ఎందుకు కొట్టాడో తెలుసు కదా..Black Shirt వేసుకుని ఎవరు ఎదురు రాకుడదంట… 

ఒంగోలు గిత్త ఎరుపుని చూస్తే రంకె వేసి మరీ కుమ్మేస్తుంది.. మన హీరో black ని చూస్తే కోపం వస్తది.. కొట్టేస్తాడు,, అది తేడా…..   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -