Thursday, May 9, 2024
- Advertisement -

బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడానికి సమంత కారణం

- Advertisement -

సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా రాజ్యం ఏలుతోంది సమంత ఆమె సినిమాలకి , బయట చేసే సంఘ సేవ కీ భారీగా ఉన్నారు అభిమానులు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నటన విషయం లో ఈ మధ్య కాలం లో వచ్చిన హీరోయిన్ లలో తోపు గా ఉంటుంది సమంత . అయితే ఆమెకి చాలా పెద్ద సెంటిమెంట్ ఉంది అది బ్రేక్ చెయ్యాలని ఆమె ఎప్పుడూ కోరుకోదు. సాధారణంగా సినిమా పరిశ్రమ అంటేనే సెంటిమెంట్ లకి పెట్టింది పేరు అలాంటి సమంత కి కూడా స్వయంగా ఒక గట్టి సెంటిమెంట్ ఉంది.

ఏదైనా సినిమా ఓకే చెప్పిన తరవాత మొదటి రోజు షూటింగ్ పూర్తి అయిన తరవాత గానీ ఆమె ఎవ్వరికీ ఆ విషయం చెప్పదు. సాధారణంగా హీరోయిన్ ని ఓకే చేసుకున్న తరవాత దాదాపు 15 రోజుల తరవాత ఆ సినిమా గురించి షూటింగ్ మొదలు పెడతారు ఇలోగా ప్రీ స్క్రిప్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా గోప్యంగా ఉంచిన సినిమాలన్నీ బాగా ఆడాయట.

అందుకే సమంతకు అది సెంటిమెంటుగా మారిందట. ఐతే సమంతకు ఎప్పట్నుంచి ఈ సెంటిమెంటు ఉందో తెలియదు. సమంత కెరీర్లో సక్సెస్ రేట్ ఎక్కువే. ఐతే ఆమె కెరీర్లో రభస.. అంజాన్ (సికిందర్) లాంటి కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాల గురించి ముందే చెప్పేసిందో ఏమో.. ఆ ఫలితాలు చూశాకే ఈ సెంటిమెంటు మొదలైందో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్యే వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ విషయంలో సమంత సెంటిమెంటు పాటించిందా లేదా అన్నదే తెలియాల్సి ఉంది.

సమంత సెంటిమెంటు గురించి తెలిసిన వాళ్లు మాత్రం.. ఆమె బ్రహ్మోత్సవం గురించి ముందే మాట్లాడేసి ఉంటుందేమో.. అందుకే ఈ సినిమాకు అంత దారుణమైన ఫలితం వచ్చిందేమో అని సెటైర్లు వేస్తున్నారు.

Related

  1. చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత
  2. జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..
  3. అసలు సమంతకి కోపమెందుకొచ్చిందీ..?
  4. సమంత తిట్టింది కాజల్ నేనా..!
  5. నీహారిక ఒక మనసు సమంతది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -