Friday, May 3, 2024
- Advertisement -

మంగళగిరి కి షిఫ్ట్ అవుతున్న జగన్ మోహన్ రెడ్డి

- Advertisement -

చాలా నెలల క్రితమే అన్నీ సర్దేసుకుని చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ పరిసర ప్రాంతాలకి షిఫ్ట్ చేసారు. స్వయంగా స్మార్ట్ సర్వే లో తనకి తాను గా పేరు కూడా  నమోదు చేసుకున్నారు.

అమరావతి నుంచే పరిపాలన కూడా మొదలు పెట్టారు చంద్రబాబు. ఇప్పుడు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ తన ఇల్లు ని గుంటూరు జిల్లా మంగళగిరి లోకి మార్చాలి అని చూస్తున్నారు.  తన నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా మంగళగిరికి మార్చడం కోసం అద్దె భవనాల కోసం వెతుకుతున్నాడు.

అద్దెభవనం దొరక్కపోతే సొంతంగా వాటిని కోనుగోలు చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయాన్ని, ఇంటిని ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు సిబిఐ తన కేసులో ఈ భవనాలను సూచించనప్పటికీ వాటిని కూడా ఈడీ అటాచ్‌ చేయడం అన్యాయమని భావిస్తున్న జగన్‌ ఈ విషయంలో కోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నాడు. ఇక జగన్‌ తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని మంగళగిరికి మార్చాలని ఇంత తొందరపడటానికి ఓ బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తన పాలనను ఒంగోలు నుండి లేదా రాయలసీమ నుండి చేస్తాడని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ విషయం జనాలలోకి వెళ్లితే రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్న ఓ వర్గం ప్రజలు తమకు దూరం అవుతారనే భయంతోనే జగన్‌ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

Related

  1. టీడీపీ కంచుకోట లో జగన్ కోసం జనం ఎగబడుతున్నారు ..
  2. పవన్ కళ్యాణ్ vs జగన్ .. ఎవరికి మీ ఓటు ?
  3. జగన్ ” గడపగడపకు ” vs చంద్రబాబు ” వంద ప్రశ్నలు “
  4. జగన్ , చంద్రబాబు ని తలదన్నేసిన కేటీఆర్
  5. గోల్ఫ్ ప్లేయర్ గా జగన్‍!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -