Monday, May 20, 2024
- Advertisement -

వైవిఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం.. కారణాలు ఇవే

- Advertisement -

వైవిఎస్ చౌదరి.. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేసిన దర్శకుడు. హరికృష్ణ, నాగార్జున లతో తీసిన సీతారామరాజు మంచి విజయం సాధించడంతో.. మహేష్ తో యువరాజ్ సినిమా చేసాడు. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేకపోయిన.. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాలతో వరస హిట్స్ కొట్టాడు. ఇక రామ్, ఇలియానాలను లాంచ్ చేస్తూ చేసిన దేవదాసు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆ తర్వాత చౌదరి చేసిన ఒక్కమగాడు, సలీమ్, సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేస్తూ తీసిన రేయ్.. మూడు వరసగా భారీగా ప్లాప్ అయ్యాయి. దాంతో చౌదరీ నష్టాల్లోకి పడిపోయాడు. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తానూ నిర్మించిన నిప్పు మూవీ కూడా భారీ ప్లాప్ కావడంతో నష్టాల్లో నుంచి వైవిఎస్ తెలుకోలేకపోయారు. ఈ ఆర్ధిక ఇబ్బందుల వల్ల.. ఆయన సూసైడ్ యత్నం చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. చౌదరీ నష్టాలో ఉండటం వల్ల చౌదరీ ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చౌదరీ ఆత్మహత్యాయత్నం ఎలా చేసారు..? అనే విషయాలు.. అధికారికంగా మాత్రం తెలియడం లేదు. సూసైడ్ ప్రయత్నం నిజంగానే జరిగిందా అనే విషయం మీద క్లారిటి కూడా లేదు. ఇక వైవిఎస్ చౌదరీ నందమూరి ఫ్యామిలికి పెద్ద ఫ్యాన్. 1998 లో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన వైవిఎస్.. దర్శకుడిగా కాకుండే.. నిర్మాతగా పనిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -