Tuesday, May 6, 2025
- Advertisement -

లాస్య, రాజ్ తరుణ్ పెళ్లి రూమర్ వెనక అసలు నిజం ఇదే!

- Advertisement -
Raj Tarun has Condemned The Rumours Linking Him With Anchor Lasya

టాలీవుడ్ లో ఈ మధ్య రాజ్ తరుణ్.. యాంకర్ లాస్య పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఎలా లంకె కుదిరిందో ఎవ్వరికీ తెలియదు. అయితే వీరిద్దరు క్లోజ్ గా దిగిన ఓ ఫొటో చూసి.. అలాగే నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే లాజిక్ ప్రకారం ఆలోచించి జనాలు ఇది నిజమే అనుకున్నారు.

కానీ ఇదంత అబద్దమని రాజ్ తరుణ్.. లాస్య ఇద్దరూ కూడా కన్ఫమ్ చేశారు. అయితే ఈ రూమర్ ఎలా వచ్చిందో లాస్య  క్లియర్ గా చెప్పింది. ఓ ఆడియో వేడుకలో తీసిన సెల్ఫీలోంచి నటుడు నోయల్ ను తప్పించి.. తమ ఇద్దరినీ మాత్రమే పెట్టి ఇలా దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పింది. ఇక రాజ్ తరుణ్ కూడా ఈ విషయం వివరణ ఇచ్చాడు. లాస్యతో పెళ్లి రూమర్ వచ్చినప్పుడు ఎంతో బాధపడ్డానని.. ఆ టైంలో ప్రెండ్స్ కూడా ఆ రూమర్ నిజమని నమ్మి.. తనకు ఫోన్ చేసినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు.

లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికి తాము సాయం చేస్తామని కూడా కొందరు ప్రెండ్స్ అన్నారని వివరించాడు. అందరికీ ఈ వార్త అబద్ధమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బందయిందని రాజ్ తరుణ్ తెలిపాడు. లాస్యను ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుకలో తప్ప మళ్లీ ఎప్పుడు కలవలేదని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని రాజ్ తరుణ్ క్లియర్ గా చేప్పేశాడు. ఆ వేడుకలో దిగిన ఫోటో వల్ల ఇంత రచ్చ జరిగిందని తెలిపాడు. 

{youtube}NbT26usvihs{/youtube}

Related

  1. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు
  2. లాస్యపై కోపంతో రవి ఏం చేస్తున్నాడో తెలుసా..?
  3. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి
  4. లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -