నటి తాప్సి పన్ను త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన బాయ్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ ఆటగాడు మథియస్ బోనుతో తాప్సీ వివాహం జరగనుంది. గత పదేళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వీరిద్దరి వివాహానికి ఉదయ్‌పూర్ వేదిక కానుండగా అతి కొద్ది మంది మాత్రమే వీరి వివాహానికి హాజరుకానున్నారు. సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని సమాచారం.
ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తన లవ్ స్టోరీని వెల్లడించింది. బాలీవుడ్‍లో తన తొలి సినిమా ఛష్మీ బద్దూర్ (2013) షూటింగ్ సమయంలో మాథియస్‍ను తాను కలిశానని..అప్పటినుండి రిలేషన్ షిప్‌లో ఉన్నామని తెలిపింది.
2010లో ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైంది తాప్సీ. తర్వాత తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ సొట్టబుగ్గల సుందరి.. పింక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాప్సీ లూటెస్ట్ మూవీ డంకీ. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘వా లడీ హై కహా’ రిలీజ్‌కు రెడీగా ఉంది.
