- Advertisement -

టైటిల్:వీడు అదో టైపు….వాడు మరో టైపు

- Advertisement -

మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ హీరోలుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సోనారిక, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం క్యారీ ఆన్ జట్టా అనే పంజాబ్ సూపర్ హిట్ చిత్రం రీమేక్. ఇక ఈ చిత్రానికి రీసెంట్ గా టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

ఆ టైటిల్ మరేదో కాదు..’వీడు అదో టైపు….వాడు మరో టైపు’. ఈ చిత్రాన్నికి జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ చెబుతోంది. మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని వారు భావిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ …ఆద్యంతం వినోదాలు పంచే చిత్రమిది. విష్ణు, రాజ్‌తరుణ్‌ పాత్రలు రెండూ దేనికదే వైవిధ్యంగా ఉంటాయి. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -