- Advertisement -

ఏపీలో హోటళ్లు..వారంలో ఒకరోజు హాలీడే!

- Advertisement -

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్‌లో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హోటల్ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్ అసోసియేషన్లు తెలిపాయి. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది.

గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలోని అనేక హోటళ్లు నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని హోటల్ యాజమాన్యాలు వారంలో ఒకరోజు హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏపీ స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి తెలిపారు. విజయవాడలో జరిగిన సంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు హోటల్ వ్యాపారాన్ని భారంగా మార్చాయని చెప్పారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ప్రతి సోమవారం రెస్టారెంట్లకు వీక్లీ హాలిడే ప్రకటించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పరిస్థితి మరింత దిగజారితే కర్ణాటక తరహాలో హోటళ్లలో కేవలం టీ, కాఫీ మాత్రమే విక్రయించే పరిస్థితి రావచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటలకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. త్వరలో జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని హెచ్చరించారు.

ఇక విశాఖపట్నంలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో నెలకు సుమారు 65 వేల సిలిండర్లు అవసరం కాగా ప్రస్తుతం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే మరిన్ని హోటళ్లు మూతపడే అవకాశముందని హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -