Saturday, May 18, 2024
- Advertisement -

ఒవైసీలకు అక్కడ ఊరంతా శత్రువులే..!

- Advertisement -

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు ఒవైసీలు. పాతబస్తీకి పరిమితం అయిన వీళ్ల పార్టీ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించే సరికి..ఇప్పుడు వీళ్లు ఇంకాస్త అవతలకు వెళ్లి బిహార్ లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

ముస్లిం జనసంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వీళ్లు అభ్యర్థులను నిలబెట్టుకొంటున్నారు. వారిని గెలిపించుకోవడానికి ఒవైసీ బ్రదర్స్ ప్రయత్నాలు చేసుకొంటున్నారు.  వీరు ఈ ఎన్నికల ప్రచారల్లో హిందువులను చంపుతాం, నరుకుతాం.. అనే మాటలు మాట్లాడకుండా.. రాజకీయ పార్టీలను మాత్రమే విమర్శించుకొంటూ ఉండటానికే పరిమితం అవుతున్నారు. మరి గత పాఠాల నుంచి నేర్చుకున్న నీతి కాబోలు. 

అయితే ఇప్పుడు ఒవైసీలకు అక్కడ అంతా శత్రువులే. ఒక పార్టీ అని కాదు.. వీళ్లు అన్ని పార్టీల వాళ్లనూ విమర్శిస్తున్నారు. ముందుగా మోడీతో మొదలు పెడతారు. మోడీ హంతకుడు అని.. ఆయన గోద్రా హత్యాకాండకు ప్రత్యక్ష కారకుడు అని విమర్శిస్తున్నారు. అలాంటి మోడీని ఎదుర్కోవాలంటే, బీజేపీని నిలువరించాలంటే మజ్లిస్ కే ఓటు వేయాలని వారు కోరుతున్నారు. అలా మొదలు పెట్టి కాంగ్రెస్ పై విరుచుకుపడతారు. కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ కూలిందనే విషయాన్ని మరవొద్దని చెబుతారు. బీజేపీ కి వ్యతిరేకించడం అంటే.. కాంగ్రెస్ కు ఓటు వేయడం కాదని.. చెబుతున్నారు. ఇక లోకల్ మేడ్ నితీశ్ కుమార్ పై కూడా వారు విరుచుకుపడుతున్నారు. నితీశ్ కుమార్ ను విమర్శించడానికి కూడా ఒక అస్త్రాన్ని రెడీగా చేసుకున్నారు. మొన్నటి వరకూ నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి ఉన్నవాడేనని. .ఒకవేళ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించి ఉంటే… నితీశ్ కూడా ఆ కూటమిలోనే ఉండేవాడని మరవవద్దని ఆయననూ ముస్లింల ముందు విలన్ గా చూపే ముందు చేస్తున్నారు ఒవైసీ అన్నదమ్ములు.

మరి తమ లాజిక్స్ తో ముస్లింలకు అందరూ శత్రవులే.. ముస్లింలకు మేమే అసలైన ప్రతినిధులం అని వీరు ప్రచారం చేసుకొంటున్నారు. మరి కేవలం ముస్లిం ఓట్లు మాత్రమే లక్ష్యంగా చేసుకున్న ఈ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. మజ్లిస్ సత్తా చాటడం కాదు.. బీజేపీకి చాలా మేలు చేస్తోందని మాత్రం అక్కడి పార్టీలుఅంటున్నాయి. బీజేపీ కాకుండా తమకు పడే ఓట్లను మజ్లిస్ చీల్చుకొంటోందని.. తద్వారా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందని… వారు నెత్తీ నోరూ బాదుకొంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -