Saturday, May 18, 2024
- Advertisement -

ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమారుడిపై హైకోర్టులో కేసు వేసిన వైసీపీ ఎమ్మెల్యే

- Advertisement -

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి నిద్ర‌లేకుండా చేస్తున్న వైసీపీకి చెందిన ముఖ్య‌నాయ‌కుల‌లో ఆర్కేను చెప్పుకోవాల్సిందే. రాజ ధాని నిర్మానం ద‌గ్గ‌ర‌నుంచి స‌దావ‌ర్తి భూమ‌లు, ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాల‌పై హైకోర్టులో అనేక కేసులు వేశారు. స‌దావ‌ర్తి భూముల విష‌యంలో ఆర్కే గెలిచారు. ఇలా ప్ర‌తీ సారి కోర్టు ద్వారా బాబు ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. దీంతో పాటు ప్ర‌భుత్వం 132 అక్రమ జీవోతో 278 మందిపై కేసులు ఎత్తివేస్తూ చంద్రబాబు జీవోపై కూడా విజ‌యం సాధించారు.

ఇప్పటికే వైసీపీపై తప్పుడు కథనాలు రాశారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కోర్టులో కేసు వేసిన ఎమ్మెల్యే ఆర్కే… ఇప్పుడు మరోసారి కోర్టును ఆశ్రయించారు. టెండ‌ర్లు పిలువ‌కుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కును అడ్వాన్స్ డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థకు కట్టబెట్టడంపై హైకోర్టులో కేసు వేశారాయన.

టెండ‌ర్లు పిల‌వ‌కుండా అసెంబ్లీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల హ‌క్కుల‌ను ఎలా ఇచ్చారో ఆర్టీఐ చట్టం కింద తాను అడిగానని, అందులో స్పీకర్‌ ఆదేశాలమేరకు 2018 చివరివరకు నామినేషన్‌ ప్రాతిపదికన సమయాభావం వల్ల అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థకు హక్కులు కేటాయించామని చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

కానీ ప్రసారాల హక్కులు కేటాయింపు అంశం స్పీకర్ ప్రివిలేజ్ కిందకు రాదని చెప్పారు. అయినా సరే అక్రమంగా టెండర్లు పిలవకుండా హక్కులను కట్టబెట్టారని విమర్శించారు. అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థ వేమూరి రాధాకృష్ణ కొడుకు అయిన వేమూరి ఆదిత్యకు చెందినదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలనూ కోర్టుకు సమర్పించామన్నారు. దీనిపై రెండు వారాల్లోగా ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -